Viral Video: పెళ్లిపీటలపైనే వధూవరుల కుమ్ములాట.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
భారతీయ వివాహాల్లో ఎన్నో పద్ధతులు అవలంభిస్తుంటారు. సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ఆచారాలు వధూవరులకు చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది.
Tending Video: పెళ్లి అనేది ఒక అబ్బాయి, అమ్మాయి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజును గుర్తుండిపోయేలా చేయడానికి ప్రత్యేకంగా చేయడానికి ఎన్నో సన్నాహాలు చేస్తారు. వైరల్ అవుతున్న ఈ వివాహంలో వచ్చిన అతిథులతో పాటు వధూవరుల (Groom and Bride) మధ్య జరిగిన పోట్లాట చూసి బిత్తరపోయారు. అయితే, ఈ ఫైటింగ్ మాత్రం వధూవరులకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. భారతీయ వివాహాల్లో ఎన్నో పద్ధతులు అవలంభిస్తుంటారు. సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ఆచారాలు వధూవరులకు చిరాకు కలిగించే అవకాశం ఉంటుంది. పెళ్లి రోజున ఓ జంట మండపం వద్ద ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో చూడండి:
View this post on Instagram
ఈ పెళ్లి వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫన్నీ, నాటకీయ ట్విస్ట్ కారణంగా ఇంటర్నెట్‌లో సందడి చేస్తోంది. ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ‘ఈ విషపూరితమైన జంట మనందరికీ తెలుసు’ అంటూ క్యాప్షన్ అందించారు.
వీడియోపై చాలా కామెంట్స్..
ఈ వీడియో నెట్టింట్లో పోస్ట్ అయిన వెంటనే నెటిజన్లు సరదా కామెంట్లతో కామెంట్ బాక్స్‌ను నింపేశారు. “వీరు కనీసం హోటల్‌కు తిరిగి వచ్చే వరకు వేచి ఉండలేరనుకుంటా. కుటుంబం, స్నేహితుల ముందు ఎందుకు గొడవపడ్డారో” అంటూ కామెంట్ చేశాడు.