Mumbai Indians: రెండు కొత్త జట్లను రంగంలోకి దింపిన ముంబై ఇండియన్స్.. ఎందుకో తెలుసా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలుచుకుంది. ఈ టైటిళ్లన్నీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే గెలిచినవే కావడం గమనార్హం.
IPL Team MI Franchise: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను 5 సార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఫ్రాంచైజీ ఇప్పుడు విదేశీ లీగ్‌ల్లోనూ సందడి చేయబోతోంది. MI ఫ్రాంచైజీ యజమాని అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ UAE, దక్షిణాఫ్రికా T20 లీగ్‌లో కూడా రెండు జట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లను కొనుగోలు చేశారన్న వార్తలు పాతవే.. అయితే కొత్త విషయం ఏమిటంటే.. ఎంఐ ఫ్రాంచైజీ ఈ రెండు లీగ్‌లలో పాల్గొనే ఈ రెండు జట్ల పేర్లు, లోగోలను ప్రకటించింది. దీనితో పాటు సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడంతోపాటు పేరు, లోగోలను కూడా విడుదల చేసింది.
MI ఫ్రాంచైజీ UAE T20 లీగ్‌లో తమ జట్టుకు ‘MI ఎమిరేట్స్’ అని పేరు పెట్టింది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో అతని జట్టు పేరు ‘MI కేప్ టౌన్’గా ప్రకటించింది. ఈ రెండు జట్లతోపాటు ముంబై ఇండియన్స్ టీంలు అన్నీ ఒకే MI కుటుంబానికి చెందినవి.
????????
Presenting @MICapeTown & @MIEmirates ??#OneFamily #MIemirates #MIcapetown @EmiratesCricket @OfficialCSA pic.twitter.com/6cpfpyHP2H
— Mumbai Indians (@mipaltan) August 10, 2022
UAE లీగ్, దక్షిణాఫ్రికా లీగ్‌లలో MI ఫ్రాంచైజీ ద్వారా జట్లను కొనుగోలు చేసిన రెండు నగరాలు. జట్టుకు వాటి పేరే పెట్టారు. అంటే యూఏఈలోని ఎమిరేట్స్, సౌతాఫ్రికా లీగ్‌లో కేప్‌టౌన్ సిటీ జట్టును కొనుగోలు చేశారు. దీంతో ‘మై ఎమిరేట్స్’, ‘మై కేప్ టౌన్’ అని పిలుస్తూ ఆ నగర అభిమానులకు అంకితం చేశారు.
రోహిత్ కెప్టెన్సీలో 5 టైటిల్స్ గెలిచిన ముంబై..
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ 5 సార్లు టైటిల్ గెలిచింది. ఈ టైటిళ్లన్నీ రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే గెలిచినవే. ముంబై చివరి స్థానంలో ఉంది. గత అంటే 2022 సీజన్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. అయితే ఇప్పుడు వచ్చే అంటే 2023 సీజన్‌లో ముంబై కచ్చితంగా ఆరోసారి టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.