Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియాదే ఆధిపత్యం.. భారీ రికార్డులు ఇవే.. ఓసారి లుక్కేయండి..
ఆసియా కప్ ఆరంభం నుంచి టీమిండియాదే ఆధిపత్యం. భారత జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
Asia Cup Records: ఆసియాలో అతిపెద్ద క్రికెట్ ఈవెంట్ అంటే ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఆగస్టు 28న టోర్నీలో బిగ్ మ్యాచ్ జరగనుంది. అంటే ఈ రోజున క్రికెట్ మైదానంలో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. 2022 ఆసియా కప్ UAEలో జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఎన్నో భారీ రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత్ ఆధిక్యం ప్రదర్శించింది. ఈ టోర్నమెంట్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా కప్‌లో భారీ రికార్డులు..
- ఆసియాకప్‌లో భారత్ అత్యంత బలమైన జట్టు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమిండియా 7 సార్లు విజేతగా నిలిచింది. అదే సమయంలో భారత్ తర్వాత శ్రీలంక 5 సార్లు, పాకిస్థాన్ 2 సార్లు గెలుపొందాయి.
- ఆసియా కప్‌లో 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్‌లో విజయం సాధించిన ఏకైక జట్టు భారత జట్టు.
- ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ సనన్ జయసూర్య రికార్డు సృష్టించాడు. అతను ఈ టోర్నీలో 25 మ్యాచ్‌లు ఆడి 53 సగటుతో 1,220 పరుగులు చేశాడు.
- అదే సమయంలో దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ భారత్ తరపున అత్యధిక పరుగులు చేశాడు. ఆసియా కప్‌లో 23 మ్యాచ్‌లు ఆడి 971 పరుగులు చేశాడు.
- ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక మాజీ గ్రేట్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉంది. ఈ టోర్నీలో 24 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీశాడు.
- అదే సమయంలో, ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్‌లో భారతదేశం నుంచి అత్యధిక వికెట్లు తీసుకున్నాడు. 12 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీశాడు.
- ఆసియా కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా శ్రీలంక మాజీ బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య పేరిట ఉంది. 25 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు చేశాడు.
- అదే సమయంలో, ఆసియా కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ పేరిట నమోదైంది. 2008లో భారత్‌పై 13 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి