On This Day: కెరీర్ డిసైడ్ చేసిన ఫొటో.. కట్‌చేస్తే.. 20 వేలకు పైగా పరుగులతో కోహ్లీకి చెక్.. రికార్డులు చూస్తే షాకే
India vs England Test Series: రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత టెస్టు జట్టుకు నయావాల్‌లా మారిన ఛెతేశ్వర్ పుజారా నేడు 36వ ఏట అడుగుపెడుతున్నాడు. గత ఏడాది కాలంగా జట్టుకు దూరమైన పుజారా.. రంజీ ట్రోఫీలో మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20 వేల పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న చివరి మూడు టెస్టులకు ఎంపికయ్యేందుకు సిద్ధమన్నట్లు సిగ్నల్ ఇచ్చేశాడు.

Cheteshwar Pujara Birthday: భారత్ – ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ నేటి నుంచి హైదరాబాద్ వేదికగా మొదలైంది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత భారత జట్టు ఇంత పెద్ద టెస్ట్ సిరీస్‌ను ఆడుతుంది. అయితే, ఈ జట్టులో చాలామంది స్టార్ ప్లేయర్లు లేరు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టీమిండియా నయా వాల్ చెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు ఆడడం లేదు. కాగా, జనవరి 25న భారత్-ఇంగ్లండ్‌ల తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, నేడు ఛెతేశ్వర్ పుజారా పుట్టినరోజు.
36 ఏళ్ల పుజారా గత దశాబ్దంలో భారత క్రికెట్‌కు వేలాది పరుగులు చేశాడు. టీమిండియాను కష్టాల నుంచి బయటకి తెచ్చే అనేక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. కానీ, ఇప్పుడు అతను భారత జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఎందుకంటే, జట్టు భవిష్యత్తు వైపు చూడాలని నిర్ణయించుకుంది. ఇదిలావుండగా, ఛెతేశ్వర్ పుజారా తన పేరిట అనేక రికార్డులను కలిగి ఉన్నాడు. వాటిని బద్దలు కొట్టడం కూడా కష్టం.
క్రికెటర్‌గా మార్చిన ఫొటో..
గత రెండు దశాబ్దాలుగా ఛెతేశ్వర్ పుజారా నిరంతరం క్రికెట్ ఆడుతున్నాడు. అయితే, అతని చిన్నతనంలో క్రికెట్ పట్ల మక్కువ ప్రారంభమైనప్పుడు, అది కెమెరా వల్ల మాత్రమే సాధ్యమైంది. నిజానికి, పుజారా చిన్నతనంలో ఇంట్లోనే క్రికెట్ ఆడేవాడు. అప్పుడు అతని బంధువు కొన్ని ఫొటోలను తీశాడు. అరవింద్ పుజారా (ఛెతేశ్వర్ తండ్రి) ఆ ఫోటోను చూసినప్పుడు, పుజారా శైలి ఎంతగానో ఆకట్టుకుంటుందంట. తద్వారా అతను ప్రొఫెషనల్ క్రికెట్‌లో చేర్పించాడు.
దీని తర్వాత ఛెతేశ్వర్ వెనుదిరిగి చూడలేదు. నేడు అతను భారత క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా పేరుగాంచాడు. ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ రికార్డును పరిశీలిస్తే, అతను 103 టెస్ట్ మ్యాచ్‌ల్లో 44 సగటుతో 7195 పరుగులు చేశాడు. పుజారా పేరిట 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పుజారా చివరిసారిగా జూన్ 2023లో భారత్ తరపున మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి అవకాశం రాలేదు.
కోహ్లీని అధిగమించిన పుజారా..
108 intl. matches 👌 7246 intl. runs 🙌 19 intl. hundreds 💯
Here’s wishing #TeamIndia batter @cheteshwar1 a very happy birthday 🎂👏 pic.twitter.com/QsmGg76cyg
— BCCI (@BCCI) January 25, 2024
తాజాగా ఛెతేశ్వర్ పుజారా కూడా తన పేరిట ఓ పెద్ద రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో పుజారా తన పేరిట 20 వేల పరుగులు సాధించాడు. అతను భారతదేశం తరపున ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. అతని కంటే ముందు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఘనత సాధించగలిగారు. ఇక విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే.. ఈ విషయంలో చాలా వెనుకబడ్డాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కోహ్లీకి 11 వేల పరుగులు మాత్రమే ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
