IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ధోని బంధంపై.. శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు.!
Mahendra Singh Dhoni: ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ మిస్టర్ కూల్..
Mahendra Singh Dhoni: ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ చెన్నైను తన సెకండ్ హోంగా భావిస్తాడు. ధోని పేరు మీద ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కెప్టెన్‌గా ధోని అత్యధిక మ్యాచ్‌లు గెలుపొందాడు. అంతేకాకుండా జట్టు నిషేధానికి గురైన రెండేళ్ల(2016, 2017) తర్వాత ధోని సారధ్యంలోనే చెన్నై మూడో టైటిల్‌ను 2018లో గెలుచుకుంది. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా చెన్నై యాజమాన్యం.. ధోని తప్ప కమాండింగ్ ఆథారిటీ మరెవ్వరికీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని పలువురు అభిమానులు, మాజీ ఆటగాళ్లు లేవనెత్తినా.. దీనికి సమాధానం దొరకలేదు. అయితే తాజాగా ఈ రహస్యాన్ని చెన్నై టీం ఓనర్ ఎన్. శ్రీనివాసన్ వెల్లడించారు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మొత్తం 197 మ్యాచ్‌లకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 119 మ్యాచ్‌లలో విజయాలు సాధించగా.. 76 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూశాడు. ధోని కెప్టెన్సీలోనే సీఎస్‌కే జట్టు ఎనిమిది సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. గత సీజన్ తప్పితే.. మిగిలిన అన్ని సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌లోకి ఎంటర్ అయింది.
చెన్నై జట్టును ప్రశంసలతో ముంచెత్తిన శ్రీనివాసన్….
ఐపీఎల్ గెలవడం అందరికీ ముఖ్యమే.. కానీ కొనసాగింపు, విధేయత అనేవి ఉండాలి. మేము గత 50 సంవత్సరాలుగా క్రికెట్‌తో అనుబంధం కలిగి ఉన్నాం. తమిళనాడు రంజీ టీంతో క్లోజ్ రిలేషన్ ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీనివాసన్.. ధోని ఆటను, కెప్టెన్సీని ప్రశంసించాడు. సీఎస్‌కే కోసం ధోని ప్రతీ మ్యాచ్ గెలవాలని చూస్తాడని.. తనకు నచ్చినట్లుగా టీంను నడిపిస్తాడని శ్రీనివాసన్ కొనియాడాడు. క్రికెట్‌ను ధోని చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2021ను ఇప్పటికే ప్రారంభించాడు. నెట్స్‌లో ముమ్మర సాధన చేస్తున్నాడు. మునుపటి ఐపీఎల్ సీజన్ చెన్నై జట్టుకు నిరాశ మిగిల్చింది. ఆ తరుణంలో ఇక ధోని ఐపీఎల్‌కు సైతం రిటైర్మెంట్ ఇస్తాడని వార్తలు వచ్చాయి. కానీ చివరికి అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి.
Also Read:
చనిపోయినట్లుగా ‘ముంగూస్’ చిలిపి డ్రామాలు.. వైరల్ వీడియో.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ .!
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు అలెర్ట్.. పలు రైళ్ల సమయాల్లో మార్పులు.. వివరాలు ఇవే.!
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ వేదికగా ప్రకటన.!