CSK vs DC IPL Match Result: 15 ఏళ్ల తర్వాత చెపాక్‌లో విజయం.. 2009 సీన్ రిపీట్ చేసిన ఢిల్లీ

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శనతో దూసుకపోతుండగా.. మరోవైపు, 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఏప్రిల్ 5వ తేదీ శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన 17వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్‌ను 25 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో 15 సంవత్సరాల తర్వాత చెపాక్‌లో ఢిల్లీ తొలిసారి చెన్నైని ఓడించింది.

CSK vs DC IPL Match Result: 15 ఏళ్ల తర్వాత చెపాక్‌లో విజయం.. 2009 సీన్ రిపీట్ చేసిన ఢిల్లీ
Csk Vs Dc Ipl Match Result

Updated on: Apr 05, 2025 | 7:41 PM

CSK vs DC IPL Match Result: ఐపీఎల్-18లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. చెన్నై జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ (DC) 25 పరుగుల తేడాతో ఓడించింది. ఢిల్లీకి ఇది వరుసగా మూడో విజయం. 2009లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన తొలి మూడు మ్యాచ్‌లను గెలవగా.. 2025లో ఆడిన తొలి మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయ్ శంకర్ 69 పరుగులతో నాటౌట్‌గా, ఎంఎస్ ధోని 30 పరుగులతో అజేయంగా నిలిచారు. ఢిల్లీ బౌలర్ విప్రజ్ నిగమ్ 2 వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

 

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 77 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ 33 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 24 నాటౌట్, సమీర్ రిజ్వీ 20 పరుగులు సాధించారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..