Ambati Rayudu Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన చెన్నై ప్లేయర్.. ముంబైలో చివరి మ్యాచ్..

చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL 2022 తర్వాత ఈ లీగ్‌కి కూడా గుడ్‌బై చెప్పనున్నాడు.

Ambati Rayudu Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన చెన్నై ప్లేయర్.. ముంబైలో చివరి మ్యాచ్..
Ambati Rayudu Retirement
Follow us
Venkata Chari

|

Updated on: May 14, 2022 | 1:33 PM

తన బ్యాట్ బలంతో చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai super kings)ను ఎన్నో మ్యాచ్‌లు గెలిపించిన అంబటి రాయుడు(Ambati Rayudu) రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2022 తర్వాత ఈ లీగ్‌కు వీడ్కోలు పలకాలని రాయుడు నిర్ణయించుకున్నాడు. ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన పేలవంగా ఉంది. ప్లేఆఫ్ రేసు నుంచి జట్టు నిష్క్రమించింది. ఈ సీజన్‌లో రాయుడు ప్రదర్శన కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బహుశా అందుకే ఈ 36 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం ఐపీఎల్‌కి కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ జట్టు తన చివరి మ్యాచ్‌ని మే 15న గుజరాత్ టైటాన్స్‌తో, మే 20న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాయుడు తన కెరీర్‌లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.

Also Read: IPL 2022: అదృష్టాన్ని మార్చిన కెప్టెన్ త్యాగం.. ఓపెనింగ్‌లో అదరగొట్టిన ప్లేయర్.. కేవలం 29 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో ఊచకోత..

ఇవి కూడా చదవండి

T20 World Cup 2022: ఆల్ రౌండ్ ప్రతిభతో ఐపీఎల్‌లో మెరిసినా.. హార్దిక్ ఆ సమస్యే టీమిండియాకు ప్రమాదకరంగా మారొచ్చు..