IPL 2022: అదృష్టాన్ని మార్చిన కెప్టెన్ త్యాగం.. ఓపెనింగ్‌లో అదరగొట్టిన ప్లేయర్.. కేవలం 29 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో ఊచకోత..

పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో RCBపై 29 బంతుల్లో వేగంగా 66 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. RCB ఫాస్ట్ బౌలర్లు జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్‌లను చిత్తు చేశాడు.

IPL 2022: అదృష్టాన్ని మార్చిన కెప్టెన్ త్యాగం.. ఓపెనింగ్‌లో అదరగొట్టిన ప్లేయర్.. కేవలం 29 బంతుల్లో 7 సిక్సర్లు, 4 ఫోర్లతో ఊచకోత..
Ipl 2022, Jonny Bairstow
Follow us

|

Updated on: May 14, 2022 | 1:21 PM

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా 60వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్‌పై 54 పరుగుల భారీ విజయం సాధించింది. ఈ విజయానికి జానీ బెయిర్‌స్టో అద్భుతమైన స్క్రిప్ట్ రచించాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ బెంగళూరును ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదు. బెయిర్‌స్టో కేవలం 29 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించగా, పంజాబ్ 20 ఓవర్లలో 209 పరుగులు చేయగలిగింది. అనంతరం బెంగళూరు జట్టు 155 పరుగులు మాత్రమే చేసి, ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో జానీ బెయిర్‌స్టో మిడిల్ ఆర్డర్‌లో విఫలమయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తన స్థానాన్ని వదిలి అతనిని ఓపెనింగ్‌కి పంపించాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వెనుదిరిగి చూడలేదు.

జానీ బెయిర్‌స్టో ఇటీవల ఇంగ్లండ్‌కు పెద్దగా ఓపెనింగ్ చేయలేదు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్‌గా ఆస్వాదిస్తున్నాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో బెయిర్‌స్టో మాట్లాడుతూ, ‘నేను ఓపెనర్‌తో సరిపెట్టుకున్న తీరు సంతోషంగా ఉంది. మళ్లీ టాప్ ఆర్డర్‌లో ఆడడాన్ని నిజంగా ఆస్వాదిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఓపెనర్‌గా వరుసగా రెండు అర్ధ సెంచరీలు..

ఇవి కూడా చదవండి

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బెయిర్‌స్టో ఒక్క పరుగు మాత్రమే సాధించగలిగాడు. అయితే ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌పై 56, శుక్రవారం 66 పరుగులతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. గత రెండేళ్లలో, బెయిర్‌స్టో ఇంగ్లండ్ తరపున టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఎక్కువ సమయం మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే కొన్ని మ్యాచ్‌లలో ఇన్నింగ్స్‌ను కూడా ప్రారంభించాడు. జోస్ బట్లర్ ఆడనప్పుడు, బెయిర్‌స్టో వికెట్ కీపర్ పాత్రను కూడా పోషిస్తాడు. బెయిర్‌స్టో మాట్లాడుతూ, ‘ఇంగ్లండ్‌కు ఆడటం, ఇక్కడ ఆడటం రెండు భిన్నమైన విషయాలు. మిడిల్ ఆర్డర్‌లో ఇంగ్లండ్‌కు నేను విభిన్నమైన పాత్రను పోషించాల్సి ఉంది’ అని పేర్కొన్నాడు.

లివింగ్‌స్టన్ కూడా..

బెంగుళూరుపై బెయిర్‌స్టో మాత్రమే కాదు.. లియామ్ లివింగ్ స్టన్ కూడా క్రీజులోకి దిగిన వెంటనే అద్భుతాలు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. లివింగ్‌స్టన్ తన ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు.

Also Read: T20 World Cup 2022: ఆల్ రౌండ్ ప్రతిభతో ఐపీఎల్‌లో మెరిసినా.. హార్దిక్ ఆ సమస్యే టీమిండియాకు ప్రమాదకరంగా మారొచ్చు..

Watch Video: రాత మారదా.. ఫోర్లు, సిక్సర్లు బాదినా.. ఇలా వికెట్ కోల్పోయానేంట్రా బాబు.. కోపంతో కోహ్లీ ఏంచేశాడంటే?