T20 World Cup 2022: ఆల్ రౌండ్ ప్రతిభతో ఐపీఎల్‌లో మెరిసినా.. హార్దిక్ ఆ సమస్యే టీమిండియాకు ప్రమాదకరంగా మారొచ్చు..

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, గుజరాత్ టైటాన్స్ IPL 2022 ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అయితే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మాత్రం పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

T20 World Cup 2022: ఆల్ రౌండ్ ప్రతిభతో ఐపీఎల్‌లో మెరిసినా.. హార్దిక్ ఆ సమస్యే టీమిండియాకు ప్రమాదకరంగా మారొచ్చు..
Hardik Pandya
Follow us
Venkata Chari

|

Updated on: May 14, 2022 | 11:13 AM

బ్యాట్స్‌మెన్‌, బౌలర్‌గానే కాక ముఖ్యంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) కెప్టెన్సీలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతను కేవలం 12 లీగ్ మ్యాచ్‌ల్లోనే కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌ను ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. గత కొన్నేళ్లుగా హార్దిక్ చాలాసార్లు గాయపడ్డాడు. తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసి, గుజరాత్ టైటాన్స్ కోసం ఎంతగానో శ్రమించాడు. అక్టోబర్-నవంబర్లలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2022(T20 World Cup 2022) కోసం భారత జట్టులో చేరడానికి కూడా అడుగుపెడుతున్నాడు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 344 పరుగులు చేసిన హార్దిక్, గుజరాత్ తరపున అత్యధిక పరుగులు చేసిన లిస్టులో రెండో స్థానంలో నిలిచాడు. విభిన్న పరిస్థితులలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తన అనుభవాన్ని ప్రదర్శించి, దూసుకపోతున్నాడు. బౌలింగ్‌లో హార్దిక్ ఎకానమీ రేట్ 7.58గా నిలిచింది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో టోర్నీలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.

Also Read: IPL 2022: డెత్ ఓవర్లలో వీరు యమా డేంజర్.. బౌలర్లపై ఊచకోతకు కేరాఫ్ అడ్రస్.. రికార్డులు చూస్తే అవాక్కే..

టోర్నీ ప్రారంభ క్షణాల్లో హార్దిక్ మాత్రమే కాకుండా గుజరాత్ టైటాన్స్‌పై కూడా ప్రశ్నల వర్షం కురిసింది. అయితే, మాజీ ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్, అతని బృందం అద్భుతమైన ప్రదర్శనతో అందరి నోళ్లు మూయించింది. హార్దిక్ ఖచ్చితంగా IPL ట్రోఫీపై తన దృష్టిని ఉంచాడని తెలుస్తోంది. అయితే అతను IPL 2022 ముగిసిన తర్వాత మెరుగైన ప్రదర్శనతో టోర్నమెంట్‌ను ముగించి, భారత జట్టులో చేరనున్నట్లు ఇప్పటికే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20I సిరీస్ కోసం దక్షిణాఫ్రికా భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో హార్దిక్ ఉంటాడని భావిస్తున్నారు.

ఎంతో పరిణితి చెందాడు..

ఇవి కూడా చదవండి

హార్దిక్ పాండ్యా మళ్లీ ఫామ్‌లోకి రావడం చాలా ప్రత్యేకమని అతిశయ్ జైన్ అన్నారు. అతను మునుపటి కంటే మెరుగైన బ్యాట్స్‌మన్, బౌలర్‌గా ఎదిగాడు. కానీ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను పరిణతి చెందిన వ్యక్తిగా మారాడు. గత నెలలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను ఐపీఎల్ ఆడుతున్నాను. దానిపై దృష్టి సారిస్తాను. నా అదృష్టం నన్ను ఎక్కడికి తీసుకువెళుతుందో చూడాలి” అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. అయితే, 28 ఏళ్ల ఆల్ రౌండర్‌కు భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను 11 మ్యాచ్‌లలో మూడు అర్ధ సెంచరీల సహాయంతో 134.27 స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో తనను తాను మూడు లేదా నాలుగు స్థానానికి చేర్చడం ద్వారా అతను గతంలో కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. దాంతో ఫలితాలు కూడా అద్భుతంగా వస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతని ప్రదర్శనలో ముఖ్యమైన భాగం అతని బౌలింగ్‌. ఇందులో అద్భుతమైన మెరుగుదల, గాయంతో బాధపడుతున్న సమయంలో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొని, తనని తాను నిరూపించుకున్నాడు.

పవర్‌ప్లే ఓవర్లలో బౌలర్‌కు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కానీ, హార్దిక్ పాండ్యా అలాంటి సందర్భాలలో బౌలింగ్ చేయాలనే బలమైన కోరికతో ముందుకుసాగుతున్నాడు. కుడిచేతి మీడియం పేసర్ పవర్‌ప్లేలో తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. పవర్‌ప్లేలో కనీసం 30 బంతులు వేసిన బౌలర్లలో అతని ఎకానమీ రేటు 5.14గా నిలిచింది. ఇది ఐపీఎల్‌ 2022లో రెండవదిగా నిలిచింది. పాండ్యా బాగా బ్యాటింగ్, బౌలింగ్ చేయడం కొత్తేమీ కాదు. అతను ఇంతకు ముందు భారతదేశం కోసం, అతని మాజీ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ కోసం ఆడటం మనం చూశాం. అతన్ని ఆటగాడిగా, టీమ్ లీడర్‌గా చూడడం బాగుంది. “కెప్టెన్సీ ఖచ్చితంగా సహాయపడుతుంది. నేను బాధ్యతలు స్వీకరించడానికి ఇష్టపడే క్రికెటర్‌ని. చాలా ఏళ్లుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఆటపై నాకు మంచి అవగాహన వచ్చింది” అంటూ పేర్కొన్నాడు.

విమర్శకులను సైతం మొప్పించాడు..

హార్దిక్ ఆకర్షణీయమైన కెప్టెన్ అని నిరూపించుకున్నాడు. ఇది అతని ఆటలో బహుశా ఎవరూ ఆలోచించని భాగం. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకున్నాడు. ఓపిక-తీవ్రమైన, నైపుణ్యంతో తెలివైన వ్యక్తిగా మారాడు. ఎంఎస్ ధోనీతో హార్దిక్ సన్నిహిత బంధాన్ని పంచుకున్నాడు. భారత మాజీ కెప్టెన్‌లోని కొన్ని లక్షణాలు జీటీ కెప్టెన్‌కి కూడా చేరినట్లు తెలుస్తోంది. అలాగే, 28 ఏళ్ల ఈ యువ ప్లేయర్ ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాడు. ఉదాహరణకు, రంజీ ఆడటానికి హార్దిక్‌ని జాతీయ జట్టు నుంచి తొలగించాలని BCCI సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో తనను తాను సాధన పట్టాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి నిర్ణయమే మళ్లీ విమర్శలను ఎదుర్కొంది.

ఈ సమయంలో, ఈ స్టైలిష్ ఆటగాడు చింతించకుండా, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మరోసారి ప్రపంచం ముందు తన సత్తాను నిరూపించుకున్నాడు. ఈ నిర్ణయం అతనికి మాస్టర్‌స్ట్రోక్‌గా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నది హార్దిక్ పాండ్యా 2.0 వర్షన్. ఒక మంచి బ్యాట్స్‌మెన్, బౌలర్, తెలివైన ఆలోచనాపరుడిగా మారాడు. అదే సమయంలో, నిఖిల్ నారాయణ్ మాట్లాడుతూ, హార్దిక్ బలవంతంగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవలసి వచ్చిందని, అయితే అతను టీమ్ ఇండియా XIలో చేర్చాల్సిన అవసరం లేదని వాదించాడు. మొదటి ఆరు మ్యాచ్‌లలో 73.75 సగటుతో 295 పరుగులు, 7.54 ఎకానమీ రేటుతో 4 వికెట్లు పడగొట్టాడు. అవును..! ఐపీఎల్ 2022లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా ప్రారంభించి తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను అరంగేట్రం చేసిన జట్టుకు నాయకత్వం వహించాడు. అయినా ఆల్ రౌండర్ హార్దిక్ పునర్జన్మ అని పిలవడం చాలా తొందరపాటే అని అంటున్నాడు.

ఫామ్, ఫిట్‌నెస్ కోల్పోతూనే ఉన్నాడు..

గ్రూప్ దశ తొలి అర్ధభాగంలో అద్భుత ప్రదర్శన కనబరచడం వాస్తవమైతే, ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల్లో హార్దిక్ పేలవమైన స్కోర్లు 10, 3, 1, 24, 11గా ఉన్నాయి. ఇది కాకుండా, హార్దిక్‌కు గాయాల సమస్య కూడా చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది. అతను గజ్జల్లో గాయం తర్వాత గత ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఒక మ్యాచ్‌లో కనీసం 2-3 ఓవర్లు బౌలింగ్ చేస్తానని హార్దిక్ గ్యారెంటీ ఇవ్వలేకపోతే, అతని బ్యాటింగ్ బలంతో ఇండియన్ ఎలెవన్‌లోకి వస్తాడా? అంటే అనుమానంగా చూడాల్సి ఉంటుంది. అతను ఎల్లప్పుడూ మంచి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతూనే ఉంటాడు. హార్దిక్ తన ఫామ్‌లో గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో అంటే 2019, 2020లో 186.1 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు. అలాగే టైటిల్ విజయంలో ముంబై ఇండియన్స్‌కు అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌లో అతను అదే క్రమంలో దిగి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 126.56 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్నాడు. డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ ఆశ్చర్యకరంగా 223 నుంచి ఈ సీజన్‌లో 156.41కి తగ్గింది.

నెం.4 బ్యాట్స్‌మెన్‌గా హార్దిక్ భారత్‌కు అవసరం లేదు. ఆ ప్లేస్ ఒక విధంగా సూర్యకుమార్ యాదవ్‌కు కేటాయించారు. ఈ సీజన్‌లో రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్‌ల ఫామ్‌ను పరిశీలిస్తే, టీమిండియాకు ఆర్డర్‌లో దిగువన ఉన్న హార్దిక్ చాలా అవసరం. నవీ ముంబైలో రాయల్స్‌తో జరిగిన ఇన్నింగ్స్ మినహా, అతను మిడిల్, డెత్ ఓవర్లలో పెద్దగా స్కోర్ చేయలేదు. హార్దిక్ 2021 నుంచి భారతదేశం కోసం ఆడుతున్నప్పుడు అతని ఫామ్‌ పడిపోవడం చూశాం. ఈ సమయంలో అతను ఎనిమిది ఇన్నింగ్స్‌లలో ఐదింట్లో భారీ స్కోర్‌లు నిర్మించడంలో విఫలమయ్యాడు. మైదానంలో ఉన్న పదకొండు మంది ఆటగాళ్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే అంతర్జాతీయ స్థాయిలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

మరిన్ని ఐపీఎల్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Watch Video: రాత మారదా.. ఫోర్లు, సిక్సర్లు బాదినా.. ఇలా వికెట్ కోల్పోయానేంట్రా బాబు.. కోపంతో కోహ్లీ ఏంచేశాడంటే?

Cricket: 20 బంతుల్లో 102 పరుగులు.. బౌండరీలతో బౌలర్ల ఊచకోత.. కోహ్లీకి మరోసారి షాకే!