AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs CSK: ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. బెంగళూరును చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది.

RCB vs CSK: ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. బెంగళూరును చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్
Chennai Super Kings
Rajeev Rayala
|

Updated on: Apr 18, 2023 | 2:40 AM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా 24వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. బెంగళూరు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. దీంతో బెంగళూర్ ముందు 227 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. చెన్నై బౌలర్ల దాటికి బెంగళూరు బ్యాట్స్ మెన్ నిలబడలేక పోయారు.

డేవాన్ కాన్వే, శివమ్ దూబే తుఫాన్ హాఫ్ సెంచరీల ఆధారంగా, చెన్నై సూపర్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో 24వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు 227 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది.ఈ హోరాహోరీ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో చెన్నై గెలుపొందింది.  కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. 8 వికెట్లు కోల్పోయి 218 పరుగులకు పరిమితమైంది.

ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. బెంగళూరు టీమ్ లో మాక్స్ వెల్, డుప్లిసిస్ అదరగొట్టారు.మాక్స్ వెల్ 76 పరుగులు, డుప్లిసిస్ 62 పరుగులతో దకుడుగా ఆడారు . అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన దినేష్ కార్తీక్ కూడా 28 పరుగులతో గట్టి పోటీ ఇచ్చాడు. కానీ చెన్నై బౌలర్ల దెబ్బకు వరసగా వికెట్లు కోల్పోయి బెంగళూరు ఓటమి చవిచూడాల్సి వచ్చింది.