T20 World Cup 2026 : ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టినా నచ్చలేదా? కుల్దీప్‌ను కాదని వరుణ్ చక్రవర్తికి చాహల్ ఓటు
T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 7 నుంచి) ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జట్లన్నీ వార్మప్ మ్యాచ్‌లతో తమ సత్తా చాటుకుంటున్నాయి.

T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో (ఫిబ్రవరి 7 నుంచి) ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జట్లన్నీ వార్మప్ మ్యాచ్‌లతో తమ సత్తా చాటుకుంటున్నాయి. కాగా ఈ టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగనుంది. అదే రోజు సాయంత్రం 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ తన తొలి పోరులో యూఎస్ఏ జట్టుతో తలపడనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందనే చర్చ జోరందుకుంది. తాజాగా భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అంచనా ప్రకారం ఉండాల్సిన ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. అయితే చాహల్ ఎంపిక చేసిన జట్టులో కొన్ని అనూహ్య మార్పులు ఉండటం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
చాహల్ ప్రకటించిన జట్టులో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టడం. న్యూజిలాండ్‌తో జరిగిన గత సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 200 పైగా స్ట్రైక్ రేట్‌తో చెలరేగిన కిషన్‌కు చాహల్ చోటు ఇవ్వలేదు. బదులుగా, కివీస్ సిరీస్‌లో విఫలమైన సంజూ శాంసన్ మంమమంను అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా పంపాలని సూచించాడు. సంజూ అనుభవంపై నమ్మకంతోనే చాహల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
గాయం నుంచి కోలుకున్న యువ సంచలనం తిలక్ వర్మను మూడో స్థానంలో చాహల్ ఎంపిక చేశాడు. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ బాధ్యతలు మోయనుండగా, ఐదో స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కింది. ఆ తర్వాత ఫినిషర్లుగా శివమ్ దూబే, రింకూ సింగ్ మరియు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను చాహల్ తన జట్టులో చేర్చుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో చాహల్ నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందుబాటులో ఉన్నప్పటికీ, చాహల్ మాత్రం మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వైపు మొగ్గు చూపాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ భుజాన వేసుకోనున్నారు. అయితే ఇటీవలి కాలంలో మెరుపులు మెరిపిస్తున్న హర్షిత్ రాణాకు చాహల్ జట్టులో చోటు కల్పించలేదు.
యూఎస్ఏ మ్యాచ్ కోసం చాహల్ ప్రకటించిన ప్లేయింగ్ 11
అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్,
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
