AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border-Gavaskar trophy: ఆస్ట్రేలియా మీదే ఒత్తిడి- వసీం జాఫర్.. కౌంటర్ ఇచ్చిన మైకెల్ వాన్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, భారత్ - ఆస్ట్రేలియా జట్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశం గత నాలుగు సిరీస్‌లను గెలుచుకుంది, కానీ ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని తిరిగి సాధించాలనుకుంటోంది. రెండు జట్లూ భారీ ఒత్తిడితో సిరీస్‌ను ప్రారంభిస్తుండగా, క్రికెట్ అభిమానులకు మరపురాని క్షణాలను అందించడం ఖాయం.

Border-Gavaskar trophy: ఆస్ట్రేలియా మీదే ఒత్తిడి- వసీం జాఫర్.. కౌంటర్ ఇచ్చిన మైకెల్ వాన్
Wasimjaffer And Michaelvaughan
Narsimha
|

Updated on: Nov 21, 2024 | 3:37 PM

Share

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమవుతుండగా, భారత్, ఆస్ట్రేలియా జట్లపై అంచనాలు, ఒత్తిడి చర్చకు కారణమయ్యాయి. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ప్రారంభమవుతున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భారత్ తన గత నాలుగు బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లను విజయవంతంగా గెలుచుకుంది, అందులో రెండు విజయాలు ఆస్ట్రేలియాలోనే సాధించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఈ సిరీస్‌ను గెలిచి గతంలో వారి ఆధిపత్యాన్ని తిరిగి కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో, మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమ్ ఇండియా స్వదేశంలో తమ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ టీమిండియా కంటే ఆస్ట్రేలియా పైనే ఒత్తిడి ఉంటుందన్నారు. టెస్టుల్లో ఇండియా ఆస్ట్రేలియాపై మంచి రికార్డ్‌ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాపై భారత్ కంటే ఎక్కువ ఒత్తిడి ఉంది. 10 సంవత్సరాలలో వారు భారత్‌ను ఓడించలేదు. స్వదేశంలో వరుసగా పరాజయాలను ఎదుర్కొన్నారు. ఆసీస్ మరొక పరాజయం గనక చవిచూస్తే ఆస్ట్రేలియన్లకు నిద్రపట్టదని వసీం జాఫర్ అని జాఫర్ ట్వీట్ చేశాడు.

జాఫర్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తనదైన శైలిలో ప్రతిస్పందించాడు. భారత్ కూడా గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్‌తో 0-3 వైట్‌వాష్ తర్వాత వారు మరో భారీ ఓటమిని టీమిండియా భరించే పరిస్థితిలో లేదని వాన్ ట్వీట్ చేశాడు. సిరీస్ తొలి టెస్టులో టీమ్ ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సేవలను కోల్పోనుంది. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. అయితే, మిగతా మ్యాచ్‌లకు రోహిత్ తిరిగి వచ్చే అవకాశం ఉంది.

ఈ సిరీస్‌లో రెండు జట్లూ ఒత్తిడితో ముందుకు సాగుతున్నాయి. భారత్ తమ విజయ పరంపరను కొనసాగించాలనుకుంటే, ఆస్ట్రేలియా తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. ఈ పోరు రెండు మేటి జట్ల మధ్య జరగనుండటంతో అభిమానులకు మర్చిపోలేని క్షణాలను అందిస్తుందనడంలో సందేహం లేదు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరోసారి క్రికెట్ ప్రపంచాన్ని ఊపేయడం ఖాయం.