Watch Video: హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నాను.. ఆయనంటే నాకు పిచ్చి: షాకిచ్చిన బాలీవుడ్ నటి

Bollywood Actress Ishita Raj Loves Cricketer Hardik Pandya: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు జులైలోనే విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ముగ్గురు నటీమణులతో హార్దిక్ పేరును ముడిపడుతూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ సమయంలో, అనన్య పాండేతో హార్దిక్ సంబంధం గురించి వార్తలు ఊపందుకున్నాయి.

Watch Video: హార్దిక్ పాండ్యాను ప్రేమిస్తున్నాను.. ఆయనంటే నాకు పిచ్చి: షాకిచ్చిన బాలీవుడ్ నటి
Hardik Pandya Ishita Raj
Follow us
Venkata Chari

|

Updated on: Aug 30, 2024 | 1:20 PM

Bollywood Actress Ishita Raj Loves Cricketer Hardik Pandya: భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌కు జులైలోనే విడాకులు ఇచ్చాడు. అప్పటి నుంచి ముగ్గురు నటీమణులతో హార్దిక్ పేరును ముడిపడుతూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ సమయంలో, అనన్య పాండేతో హార్దిక్ సంబంధం గురించి వార్తలు ఊపందుకున్నాయి. కొన్ని రోజుల క్రితం, నటి జాస్మిన్ వాలియాతో కూడా డేటింగ్ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఇషితా రాజ్ పాండ్యాను తన క్రష్ అంటూ చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. పాండ్యా అంటే తనకు చాలా ఇష్టమని కూడా తెలిపింది. దీంతో భారత ఆల్ రౌండర్ మరోసారి వెలుగులోకి వచ్చాడు.

పాండ్యా గురించి ఏం చెప్పిందంటే?

ఐపీఎల్ 2024 నుంచి హార్దిక్ పాండ్యా నిరంతరం ముఖ్యాంశాలలో ఉన్నాడు. గతంలో రోహిత్ శర్మతో కెప్టెన్సీ వివాదం కారణంగా అతను చాలా రోజుల పాటు లైమ్‌లైట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత 2024 టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించి హీరోగా మారాడు. కొన్ని రోజుల తర్వాత విడాకుల వార్తలతో మీడియాలో హల్‌చల్ చేశాడు. ఇదే క్రమంలో అనన్య పాండే, జాస్మిన్ వాలియాతో డేటింగ్ వార్తల మధ్య, బాలీవుడ్ నటి ఇషితా రాజ్ అతనిపై తన ప్రేమను ప్రకటించింది.

ఫిల్మీజ్ఞాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పాండ్యా అంటే తనకు చాలా ఇష్టం. అతను అద్భుతమైన క్రికెట్ ఆల్ రౌండర్. అతని బ్యాటింగ్ చూడటం చాలా బాగుంటుంది. హార్దిక్‌ను నేను ప్రేమిస్తున్నాను. నిజం చెప్పాలంటే, అతను నా అభిమాన క్రికెటర్లలో ఒకడు’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇషితా రాజ్ ఎవరు?

హార్దిక్ పాండ్యాపై తన ప్రేమను చాటుకున్న ఇషిత అతని కంటే 4 ఏళ్లు పెద్దది. పాండ్యా వయసు 30 ఏళ్లు కాగా, ఇషిత వయసు 34 ఏళ్లు. ఆమె ఢిల్లీ నివాసి. గార్గి కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత, ఆమె ఇంగ్లాండ్‌లో బిజినెస్‌పై స్టడీస్ పూర్తి చేసింది. 2011లో ప్యార్ కా పంచ్‌నామా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఇషిత. ఈ సినిమా ఆమెకు చాలా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత సోను కే టిటు కి స్వీటీ వంటి ప్రసిద్ధ చిత్రాలలో పనిచేసింది. ఇప్పటి వరకు 9 సినిమాలు చేసింది.