AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: టీఎంసీ నుంచి పఠాన్, బీజేపీ నుంచి షమీ?.. బెంగాల్ ఎన్నికల సంగ్రామంలో టీమిండియా క్రికెటర్లు..

BJP Trying to Rope in Cricket Mohammed Shami: లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నియోజకవర్గంలో క్రికెటర్ మహ్మద్ షమీని పోటీకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వార్తలు వస్తున్నాయి. బెహ్రాంపూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ యూసుఫ్ పఠాన్‌కు టికెట్ ఇవ్వడంతో షమీ బీజేపీలో చేరనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. మొహమ్మద్ షమీ ఇటీవల హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.

Mohammed Shami: టీఎంసీ నుంచి పఠాన్, బీజేపీ నుంచి షమీ?.. బెంగాల్ ఎన్నికల సంగ్రామంలో టీమిండియా క్రికెటర్లు..
Shami And Yusuf Pathan
Venkata Chari
|

Updated on: Mar 12, 2024 | 4:16 PM

Share

Team India Cricketers: గత కొన్నాళ్లుగా సినీ తారలు ఓ వెలుగు వెలిగిన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు క్రికెటర్ల ఆట మొదలైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని బెహ్రాంపూర్ నియోజకవర్గం (Behrampur Constituency) నుంచి టీఎంసీ పార్టీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌కు టికెట్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో మొహమ్మద్ షమీ(Mohammed Shami)ని ఎన్నికల బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోందని మీడియాలో పుకార్లు షికార్లు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం బెంగాల్‌లోని బసిర్‌హత్ (Basirhat) నియోజకవర్గం నుంచి మహ్మద్ షమీని బీజేపీ బరిలోకి దించబోతోందని చెబుతున్నారు.

మహ్మద్ షమీని బీజేపీ నేతలు కలిసిన పరిణామమే ఇందుకు దారితీసింది. లోక్‌సభ ఎన్నికల్లో షమీని బరిలోకి దింపాలనే ఆలోచన బీజేపీలో ఉందని, అందుకే షమీ అలాంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చారని చెబుతున్నారు. అయితే, ఈ రూమర్ ప్రకారం మహ్మద్ షమీ బీజేపీలో చేరడం లేదా ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గాయం కారణంగా ప్రస్తుతం క్రికెట్‌కు స్వల్ప విరామం తీసుకున్న మహ్మద్ షమీ ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్‌ హైలైట్‌గా నిలిచింది. భారత్ ఫైనల్ చేరడానికి షమీ కూడా ప్రధాన కారణం. ప్రధాని నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి ఆటగాళ్లను అభినందించారు. ఈసారి మహ్మద్ షమీని మోదీ హగ్ చేసుకున్న వీడియో మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మహ్మద్ షమీ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. షమీ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ పరిణామాలన్నీ మహ్మద్ షమీ బీజేపీలో చేరవచ్చన్న ప్రచారానికి బలం చేకూర్చాయి.

షమీ బరిలోకి దిగుతారని భావిస్తున్న బషీర్‌హత్ నియోజకవర్గం నుంచి టీఎంసీ పార్టీ హాజీ నూరుల్ ఇస్లాంను పోటీకి దింపింది. ఒకవేళ షమీ నిజంగానే బీజేపీ నుంచి పోటీ చేస్తే, ఈ టీఎంసీ కంచుకోటలో ఆయన ఎంతమేరకు సత్తా చాటుతారనేది ఆసక్తికరంగా మారింది.

టీఎంసీ పార్టీ బెహ్రాంపూర్ నుంచి యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దింపింది. బర్దమాన్ దుర్గాపూర్ నియోజకవర్గం నుంచి మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌కు టికెట్ లభించింది.

శత్రుఘ్న సిన్హా, హాజీ నూరుల్ ఇస్లాం, అభిషేక్ బెనర్జీ, ప్రసూన్ బెనర్జీ, ప్రతిమా మోండల్, సుదీప్ బందోపాధ్యాయ, మహువా మోయిత్రా, షానవాజ్ అలీ రిజ్వాన్ వంటి ముఖ్యులకు టిఎంసి పార్టీ టిక్కెట్లు ఇచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..