- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Royal Challengers Bangalore Star Player Dinesh Karthik Sets IPL Retirement Date check here
IPL 2024: బెంగళూరు ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. చివరి ఐపీఎల్ ఆడనున్న టీమిండియా ప్లేయర్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ 17 మార్చి 22 నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై వేదికగా జరిగే ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 ప్రారంభం కానుంది. అయితే, ఓ టీమిండియా స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
Updated on: Mar 10, 2024 | 8:22 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) ప్రారంభానికి ఇంకా రోజులు మాత్రమే మిగిలి ఉండగానే, షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ వార్త కావడం గమనార్హం. అంటే RCB ఆటగాడు ఈసారి IPL ద్వారా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.

ఆర్సీబీ జట్టు ఫినిషర్ దినేష్ కార్తీక్ ఈసారి ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ RCB టీమ్ వర్గాలు ధృవీకరించాయి.

RCB జట్టు వర్గాల సమాచారం ప్రకారం, దినేష్ కార్తీక్ ఈసారి IPLకి వీడ్కోలు పలకడం ఖాయమని తెలుస్తోంది. అంటే ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఆడే చివరి మ్యాచ్ డీకే చివరి ఐపీఎల్ మ్యాచ్ అని తేలింది. దీంతో, ఈసారి ఐపీఎల్‌కి డీకే వీడ్కోలు పలుకుతారని, దీంతో దినేష్ కార్తీక్ తన 17 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌ను ముగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దినేష్ కార్తీక్ తన IPL కెరీర్‌ను 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరపున ఆడడం ద్వారా ప్రారంభించాడు. 2011లో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) తరపున ఆడాడు. 2012లో ముంబై ఇండియన్స్‌లో భాగమైన డీకే 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు తిరిగి వచ్చాడు. 2015లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు.

2016-17లో గుజరాత్ లయన్స్ (ఇప్పుడు లేదు) తరపున ఆడిన దినేష్ కార్తీక్ 2018 నుంచి 2021 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. 2022 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైన డీకే ఈ ఐపీఎల్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.




