- Telugu News Photo Gallery Cricket photos Enlgand Star Player Joe Root Creates Test Record Against India sachin and panting records break
Joe Root: భారత్‌లో సిరీస్ ఓడిపోయినా.. సచిన్, పాంటింగ్ రికార్డులు బ్రేక్ చేసి వెళ్లిన ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్..
Joe Root Records: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాలలో భారత్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయినా.. జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో రూట్ బాధ్యతాయుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో జో రూట్ భారత్‌పై ప్రత్యేక రికార్డును లిఖించాడు.
Updated on: Mar 11, 2024 | 7:15 AM

ధర్మశాలలో భారత్‌తో జరిగిన 5వ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయినా.. జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో 2వ ఇన్నింగ్స్‌లో రూట్ బాధ్యతాయుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో జో రూట్ భారత్‌పై ప్రత్యేక రికార్డును లిఖించాడు. అది కూడా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం.

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ భారత్‌పై టెస్టు క్రికెట్‌లో అత్యధిక 50+ స్కోర్‌లు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. టీమ్ ఇండియాపై 29 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పాంటింగ్ 20 సార్లు 50+ పరుగులు చేశాడు.

ఇప్పుడు జో రూట్ 21వ సారి 50+ పరుగులు చేసి భారత్‌పై కొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాపై 30 మ్యాచ్‌లు ఆడిన రూట్ 10 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు సాధించాడు. దీని ద్వారా 50+ 21 సార్లు స్కోర్ చేసి రికార్డు సృష్టించాడు.

దీంతో పాటు ఈ సిరీస్‌తో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా జో రూట్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 32 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 2535 పరుగులు చేశాడు.

ఇప్పుడు జో రూట్ 30 టెస్టు మ్యాచ్‌ల్లో మొత్తం 2846 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో ఇండో-ఇంగ్లండ్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.




