
Chennai Super Kings vs Delhi Capitals, 17th Match: చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో తమ నాలుగో మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో చిన్నస్వామి స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన చెన్నై ముందుగా బౌలింగ్ చేస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది కీలకమైన మ్యాచ్. ఈ పిచ్ ఇరు జట్లకు ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మైదానంలో ప్రతి పరుగు కీలకం కానుంది. బ్యాటర్లు భారీ స్కోరు సాధించడానికి కష్టపడి పనిచేయాల్సిందే.
అభిషేక్ పోరెల్ తన బ్యాట్‌తో బంతిని కొట్టకపోయినా.. తన పేరుతో నాలుగు అదనపు పరుగులు సాధించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ రెండవ ఓవర్ నాల్గవ బంతికి ఈ సీన్ చోటు చేసుకుంది. ఈ సమయంలో ముఖేష్ చౌదరి బౌలింగ్ చేస్తున్నాడు. అవుట్ సైడ్ ఆఫ్‌లో ముఖేష్ ఓ షార్ట్ డెలివరీని సంధించాడు. బంతి వేగంగా పైకి లేవడంతో పోరెల్ దానిని అప్పర్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి అతని బ్యాట్‌కు తాకలేదు. బంతి కీపర్ ధోని క్యాచ్ చేయలేని ఎత్తులో వెళ్లింది. ఈ క్రమంలో బంతి బౌండరీ వైపు పరుగులు తీసింది.
అయితే, అంపైర్ పోరల్ బ్యాట్ నుంచి ఫోర్ వచ్చినట్లు సిగ్నల్ ఇచ్చాడు. చూసేవాళ్లంతా కూడా ధోనీ క్యాచ్ వదిలేసినట్లు అనిపించింది. అయితే, రీప్లేల్లో బంతి బ్యాట్‌కు తగలలేదని స్పష్టంగా కనిపించింది. అంపైర్ మిస్టేక్‌తో అభిషేక్ పోరెల్ ఖాతాలో బౌండరీ చేరింది. నాలుగు బైలు ఇవ్వాల్సిన చోట.. అంపైర్ ఇలాంటి బ్లండర్ మిస్టేక్ చేయడం ఏంటని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అదే ఓవర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగులు సాధించింది. ఆ బౌండరీతో పాటు మరో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కూడా అభిషేక్ పోరల్ బాదడం విశేషం.
ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ త్వరగానే పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పోరెల్ 20 బంతుల్లో 33 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..