IND vs AUS: ‘పిచ్’ఎక్కుతోందిరా బాబు.. ఆస్ట్రేలియాను టెన్షన్ పెడుతోన్న ‘మూడు’.. ఇండోర్‌లోనూ సేమ్ సీన్?

Border-Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి ఇండోర్‌లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియాల మద్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

IND vs AUS: 'పిచ్'ఎక్కుతోందిరా బాబు.. ఆస్ట్రేలియాను టెన్షన్ పెడుతోన్న ‘మూడు’.. ఇండోర్‌లోనూ సేమ్ సీన్?
Ind Vs Aus 3rd Test
Follow us
Venkata Chari

|

Updated on: Feb 28, 2023 | 5:50 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి ఇండోర్‌లో భారత్ వర్సస్ ఆస్ట్రేలియాల మద్య మూడో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌ కూడా గెలవాల్సి ఉంటుంది. ఉత్సాహంతో ఇండోర్‌లో బరిలోకి దిగేందుకు టీమిండియా సిద్ధమైంది. మరోవైపు, ఆస్ట్రేలియా మాత్రం తిరిగి పుంజుకోవాలని కోరుకుంటోంది. ఇప్పటికే రెండు టెస్టులు ఓడిపోయిన కంగారుల టీం.. ఇండోర్‌లో పరువు నిలుపుకోవాలని ఆరాపడుతోంది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. నాగ్‌పూర్, ఢిల్లీ టెస్టుల సీన్ రిపీటవుతుందేమోనని టెన్షన్‌ మొదలైంది. ‘మూడు’ రోజుల్లోనే తొలి రెండు టెస్టులు పూర్తి కావడంతో, మూడో టెస్టులోనూ అదే రిపీటవుతుందేమోనని భయపడుతోంది. ఇదే జరిగితే, ఆస్ట్రేలియాకు భారీ షాక్ తప్పదని అంతా భావిస్తున్నారు. ఇటు బ్యాటింగ్‌లోనూ, అటు బౌలింగ్‌లోనూ వరుసగా విఫలమవుతున్న ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా మీడియా నుంచే కాకుండా మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఇండోర్‌లో తీవ్ర ఒత్తిడి ఎదుర్కోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..