Viral Video: లైవ్ మ్యాచ్‌లో తేనె టీగల దాడి.. భయపడిపోయిన క్రికెటర్లు.. వీడియో వైరల్
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా వోర్సెస్టర్‌షైర్ ఎసెక్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో తేనెటీగలు కలకలం రేపాయి. లైవ్ మ్యాచ్ లో మైదానంలోకి తేనె టీగలు రావడంతో క్రికెటర్లు భయపడ్డారు. దీంతో మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేశారు.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డివిజన్ వన్ మ్యాచ్ సందర్భంగా ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా రెండు జట్లు, వోర్సెస్టర్‌షైర్, ఎసెక్స్ ముఖాముఖి తలపడ్డాయి. ఎసెక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వోర్సెస్టర్‌షైర్ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఎసెక్స్ బౌలర్లు ప్రారంభంలోనే వోర్సెస్టర్‌షైర్ ను గట్టిగా దెబ్బ తీశారు. దీంతో ఆ జట్టు 123 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే అనూహ్యంగా మైదానంలోకి తేనె టీగలు దూసుకొచ్చాయి. దీంతో ఆటగాళ్లతో పాటు అంపైర్లు నేలపై పడుకోవాల్సి వచ్చింది. తేనెటీగలు మైదానం విడిచి వెళ్ళే వరకు ఆటగాళ్లందరూ నేలపైనే పడుకుని ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కౌంటీ ఛాంపియన్‌షిప్ తన సోషల్ మీడియా పేజీలో అప్‌లోడ్ చేసింది.
కాగా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వోర్సెస్టర్‌షైర్ 97.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. రాబ్ జాన్స్, మాథ్యూ వెయిట్ ల అర్ధ సెంచరీలతో ఆజట్టు కోలుకుంది. రాబ్ జాన్స్ 117 బంతుల్లో 54 పరుగులు చేయగా, మాథ్యూ వెయిట్ 91 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మాథ్యూ వెయిట్, టామ్ టేలర్ ఎనిమిదో వికెట్‌కు 95 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరును 350 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లారు. ఆట ముగిసే సమయానికి బెన్ ఎల్లిసన్ 34 పరుగులు, యద్వీందర్ సింగ్ 5 పరుగులతో ఉన్నారు. ఎసెక్స్ తరఫున షేన్ స్నీటర్ మూడు వికెట్ల పడగొట్టాడు నోహ్ థీన్, మాట్ క్రిచ్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జేమీ పోర్టర్, కసున్ రంజిత ఒక్కో వికెట్ నేలకూల్చారు.
View this post on Instagram
కాగా ఇలా కౌంటీ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు తేనె టీగలు దాడి చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ పలు సార్లు ఇదే కారణంతో మ్యాచ్ లు నిలిపేశారు.
గతంలోనూ..
̶R̶a̶i̶n̶…̶B̶a̶d̶ ̶L̶i̶g̶h̶t̶…̶ 𝐁𝐄𝐄𝐒 stop play??? 🤣
Not something I thought I’d be tweeting today. A swarm of bees force the players and umpires to hit the deck at Grace Road. 🐝
Ollie Robinson’s bowling spin too.
Just an average Sunday.
🦊 #CountyTogether pic.twitter.com/W0FkY3MMD2
— Leicestershire CCC 🦊 (@leicsccc) May 15, 2022
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








