ఆస్ట్రేలియాను షేక్ చేస్తోన్న భారత ఆటగాడు.. రికార్డు హ్యాట్రిక్‌లతో దూసుకెళ్తోన్న ఆ బౌలర్ ఎవరంటే?
BBL 2022: భారత సంతతికి చెందిన ఆటగాడు గురిందర్ సింగ్ సంధు బిగ్ బాష్ లీగ్‌లో సందడి చేస్తున్నాడు. సిడ్నీ థండర్‌కు తరపున గురిందర్ సింగ్ సంధు హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు.
BBL 2022: భారత సంతతికి చెందిన ఆటగాడు గురిందర్ సింగ్ సంధు బిగ్ బాష్ లీగ్ ఆఫ్ ఆస్ట్రేలియాలో సత్తా చాటుతున్నాడు. పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌కు చెందిన గురిందర్ సింగ్ సంధు హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో గురిందర్‌కి ఇది మూడో హ్యాట్రిక్‌కాగా, బీబీఎల్‌లో మొదటిది. అతను ఇంతకుముందు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించాడు. అలా చేసిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గాను నిలిచాడు.
గురువారం జరిగిన మ్యాచ్‌లో గురిందర్ బౌలింగ్‌లో సిడ్నీ థండర్ 6 వికెట్ల తేడాతో పెర్త్ స్కార్చర్స్‌పై విజయం సాధించింది. గురిందర్ తన రెండు ఓవర్లలో వరుసగా మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించాడు. అతను పెర్త్ స్కార్చర్స్‌లో కోలిన్ మున్రో, ఆరోన్ హార్డీ, లారీ ఎవాన్స్‌ల వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ చివరి బంతికి మున్రోను పెవిలియన్‌కు పంపాడు గురిందర్. దీని తర్వాత 14వ ఓవర్‌కు వచ్చిన గురిందర్ తొలి బంతికి హార్డీని, రెండో బంతికి లోరీని అవుట్ చేశాడు. ఈ విధంగా రెండు ఓవర్లలోనే హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
బీబీఎల్‌లో సిడ్నీ జట్టు తరఫున హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా గురిందర్ నిలిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. గురీందర్ ఇంతకుముందు మార్ష్ కప్ 2018, 2021లో కూడా హ్యాట్రిక్ సాధించాడు.
ఆస్ట్రేలియా తరఫున వన్డే మ్యాచ్‌లు.. గురీందర్ సంధు తల్లిదండ్రులు పంజాబ్‌లో జన్మించారు. సంధు ఆస్ట్రేలియా తరఫున వన్డే మ్యాచ్‌లు కూడా ఆడాడు. జనవరి 2015లో అతను వన్డేలలో ఆస్ట్రేలియా తరపున ఆడిన మొదటి భారతీయ సంతతికి చెందిన ఆటగాడిగా మారాడు. సంధు తన అంతర్జాతీయ కెరీర్‌లో కేవలం రెండు వన్డేలు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతను మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు.
Gurinder Sandhu now has not one, not two, but THREE domestic hat-tricks to his name. INCREDIBLE!
A BKT Golden Moment | #BBL11 pic.twitter.com/NUsnit0SFo
— cricket.com.au (@cricketcomau) January 6, 2022
IPL 2022: ఐపీఎల్ 2022లో కీలక మార్పులు.. ‘ప్లాన్ బి’ని సిద్ధం చేసిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా?