AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Shastri vs Ganguly: కెప్టెన్సీ వివాదంపై రవిశాస్త్రి కీలక ప్రకటన.. అసలు కారణం అదేనంటూ గంగూలీపై సెటైర్లు

Team India: ప్టెన్సీపై విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య కొనసాగుతున్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. అంతకుముందు విలేకరుల సమావేశంలో కోహ్లీ తనను అడగకుండానే వన్డేల కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించిందని ఆరోపించారు.

Ravi Shastri vs Ganguly: కెప్టెన్సీ వివాదంపై రవిశాస్త్రి కీలక ప్రకటన.. అసలు కారణం అదేనంటూ గంగూలీపై సెటైర్లు
Ravi Shastri Virat Kohli
Venkata Chari
|

Updated on: Jan 07, 2022 | 9:11 AM

Share

Virat Kohli vs BCCI: కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య కొనసాగుతున్న వివాదం ఆగేలా కనిపించడం లేదు. అంతకుముందు విలేకరుల సమావేశంలో కోహ్లీ తనను అడగకుండానే వన్డేల కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించిందని ఆరోపించారు. దీని తర్వాత, ఇటీవల, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కూడా కోహ్లీ వాదనను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక ప్రకటన చేశాడు. శాస్త్రి ఈ విషయాన్ని ముందుగా ఎలా పరిష్కరించవచ్చో పేర్కొన్నాడు. దీంతో పాటు ఈ విషయంపై ప్రకటన చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని డిమాండ్ చేశాడు.

రవిశాస్త్రి ఏం చెప్పాడంటే? రవిశాస్త్రి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సింది. ఈ విషయం కోహ్లి, బోర్డు మధ్య ఇంతకుముందే చర్చలు జరిగి ఉంటే, బహుశా ఈ విషయం ఇక్కడికి చేరి ఉండేది కాదు. ఇప్పుడు కోహ్లీ తన పాయింట్‌ని అందరి ముందు ఉంచాడని, సౌరవ్ గంగూలీ కూడా తన పాయింట్‌ని నిలబెట్టుకోవాలని శాస్త్రి సూచించాడు. నిజం అందరి ముందుకు రావాలని అన్నారు. అయితే ఇందుకోసం ఇరువర్గాల మధ్య చర్చలు జరగాలి. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించే నిర్ణయంపై శాస్త్రి గతంలోనూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు బీసీసీఐ నిర్ణయాన్ని ప్రశంసించాడు.

విరాట్‌తో తనకున్న బంధంపై.. తనకు, విరాట్ కోహ్లీకి మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ, మా మధ్య చాలా మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రజలు ఏం చెప్పినా విరాట్, నేను వృత్తిపరమైన పద్ధతిలో తన పనిని చేశామన్నాడు. తనకు, విరాట్ కోహ్లీ ఆలోచనా విధానాలకు చాలా సారూప్యత ఉంటుందని రవిశాస్త్రి అన్నాడు. మైదానంలో కోహ్లీ దూకుడు వైఖరిని కూడా ఇష్టపడతాను అని తెలిపాడు. తన కెరీర్ తొలినాళ్లలో తాను కూడా కోహ్లిలా దూకుడుగా ఉండేవాడినని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Also Read: ఆస్ట్రేలియాను షేక్‌ చేస్తోన్న భారత ఆటగాడు.. రికార్డు హ్యాట్రిక్‌లతో దూసుకెళ్తోన్న ఆ బౌలర్ ఎవరంటే?

IND vs SA: విజయంతో కొత్త ఏడాదికి వెల్‌కం చెప్పిన దక్షిణాఫ్రికా.. భారత్‌ ఓటమితో వాండరర్స్‌లో రికార్డుల వర్షం..!