BAN vs IND: మూడేళ్ల తర్వాత సెంచరీ ముచ్చట తీర్చుకున్న విరాట్‌.. దెబ్బకు రికీ పాంటింగ్‌ రికార్డు కూడా బద్దలు

ఇన్నింగ్స్‌ ప్రారంభంలో ఇషాన్‌ కిషన్‌తో కలిసి వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యమిచ్చిన కోహ్లీ అర్ధసెంచరీ తర్వాత గేర్‌ మార్చాడు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. తద్వారా మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే సెంచరీ ముచ్చటను తీర్చుకున్నాడు.

BAN vs IND: మూడేళ్ల తర్వాత సెంచరీ ముచ్చట తీర్చుకున్న విరాట్‌.. దెబ్బకు రికీ పాంటింగ్‌ రికార్డు కూడా బద్దలు
Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2022 | 3:22 PM

చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ సాధించాడు. సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో విఫలమైన విరాట్ చివరి వన్డేలో ధాటిగా ఆడాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో ఇషాన్‌ కిషన్‌తో కలిసి వికెట్‌ కాపాడుకునేందుకే ప్రాధాన్యమిచ్చిన కోహ్లీ అర్ధసెంచరీ తర్వాత గేర్‌ మార్చాడు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. తద్వారా మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే సెంచరీ ముచ్చటను తీర్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ కేవలం 85 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో11 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి. ఓవరాల్‌గా 113 పరుగులు చేసిన కోహ్లీ భారీ షాట్‌ కు యత్నించి ఔటయ్యాడు. కాగా వన్డే క్రికెట్‌లో విరాట్‌కు ఇది 44వ సెంచరీ కాగా ఓవరాల్‌గా 72వది. అంతకుముందు, అతను ఆగస్టు 2019లో చివరిసారిగా తన 43వ సెంచరీని సాధించాడు. ఇక బంగ్లాదేశ్‌పై అతనికిది నాలుగో సెంచరీ. ఈ సెంచరీలన్నీ బంగ్లాదేశ్‌ గడ్డపైనే సాధించడం విశేషం.

సచిన్‌ తర్వాత..

కాగా కొన్ని నెలల క్రితం ముగిసిన ఆసియా కప్‌లో టీ20ల్లో 71వ శతకాన్ని అందుకున్న విరాట్… మూడు నెలల గ్యాప్‌లోనే వన్డేలో శతకాన్ని నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కొట్టడం ద్వారా, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్‌ రికీ పాంటింగ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా సచిన్ టెండూల్కర్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ కెరీర్‌లో అత్యధికంగా 100 ఇంటర్నేషనల్‌ సెంచరీలు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇదే మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ విరాట్‌ రికార్డులకెక్కాడు. ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో 59 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ కింగ్‌ కోహ్లి ఈ మైలు రాయిని అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..