Babar Azam: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్‌కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌ బై.. కారణం ఏంటంటే?

|

Oct 02, 2024 | 8:36 AM

Babar Azam Resign From Pakistan White Ball Captaincy: కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్‌లో నిరంతర గందరగోళం నెలకొంది. పీసీబీ కెప్టెన్సీ నుంచి బాబర్ అజామ్‌ను తొలగించి, మహ్మద్ రిజ్వాన్‌కు బాధ్యతలు అప్పగించవచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత బాబర్ ఆజం ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ పదవిలో కొనసాగుతాడని వార్తలు వచ్చాయి.

Babar Azam: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్‌కు బిగ్ షాక్.. కెప్టెన్సీకి బాబర్ ఆజం గుడ్‌ బై.. కారణం ఏంటంటే?
Babar Azam
Follow us on

Babar Azam Resign From Pakistan White Ball Captaincy: కొంతకాలంగా పాకిస్థాన్ క్రికెట్‌లో నిరంతర గందరగోళం నెలకొంది. పీసీబీ కెప్టెన్సీ నుంచి బాబర్ అజామ్‌ను తొలగించి, మహ్మద్ రిజ్వాన్‌కు బాధ్యతలు అప్పగించవచ్చని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత బాబర్ ఆజం ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ పదవిలో కొనసాగుతాడని వార్తలు వచ్చాయి. మరోవైపు కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు బాబర్ స్వయంగా ప్రకటించాడు. బాబర్ గత ఏడాది మూడు ఫార్మాట్ల కెప్టెన్సీని విడిచిపెట్టాడు. అయితే, అతను ఈ సంవత్సరం వైట్ బాల్‌లో కెప్టెన్‌గా నియమించబడ్డాడు. అయితే, మళ్లీ కెప్టెన్‌గా బాబర్‌ ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయాడు.

గతకొంత కాలంగా పాక్ ప్రదర్శన మామూలుగానే ఉంది. గతేడాది బాబర్ కెప్టెన్సీలో వన్డే ప్రపంచకప్‌లో చాలా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే కథను రిపీట్ చేసింది. USA, వెస్టిండీస్‌లో ఆడిన టోర్నమెంట్‌లో పాకిస్తాన్ జట్టు అమెరికా జట్టు చేతిలో ఘోర పరాజయం చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత బాబర్ ఆజం జట్టుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే, వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు బాబర్ కెప్టెన్సీలో కొనసాగుతాడని అంతా భావించారు. కానీ, ఇప్పుడు అతను స్వయంగా ఈ బాధ్యతను విడిచిపెట్టాడు.

కెప్టెన్సీ పదవికి బాబర్ ఆజం రాజీనామా..

పాకిస్థాన్ వైట్ బాల్ కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్టు బాబర్ ఆజం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించారు. ప్రియమైన అభిమానులారా, ఈరోజు నేను మీతో ఒక వార్తను పంచుకుంటున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు. గత నెలలో పీసీబీ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు నేను చేసిన కమ్యూనికేషన్ ప్రకారం, పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ టీమ్‌కి నాయకత్వం వహించడం గౌరవంగా ఉంది. కానీ, నేను తప్పుకుని నా పాత్రపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

బాబర్ ఏమన్నారంటే..

“కెప్టెన్సీ ఒక గొప్ప అనుభవం. అయితే, పనిభారాన్ని కూడా పెంచింది. నేను నా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాను. నా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపాలనుకుంటున్నాను. ఇది నాకు సంతోషాన్నిస్తుంది. నిష్క్రమించడం నాకు ముందుకు సాగడానికి, నా ఆటపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇది కాకుండా, బాబర్ ఆజం తన ట్వీట్‌లో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు తిరుగులేని మద్దతు, నాపై విశ్వాసం ఉంచినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ఉత్సాహమే నాకు ప్రపంచం. మేం కలిసి సాధించిన దాని గురించి నేను గర్వపడుతున్నాను. ఒక ఆటగాడిగా జట్టుకు సహకారాన్ని కొనసాగించడానికి సంతోషిస్తున్నాను. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..