డామిట్.! కథ అడ్డం తిరిగింది.. అప్పుడు రోహిత్, కోహ్లీని భయపెట్టాడు.. ఇప్పుడు కెరీర్‌కు ఫుల్‌స్టాప్
ఆస్ట్రేలియన్ ఆటగాడు రాష్ట్ర క్రికెట్‌లో తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టులో లేడు. భారత పర్యటనలో అతను తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు.మరి ఇంతకీ ఈ ప్లేయర్ ఎవరంటే

16 ఏళ్ల సుదీర్ఘమైన డొమెస్టిక్ క్రికెట్‌కు ముగింపు పలికాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్. డొమెస్టిక్ టీ20లకు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పిన అతడు.. వన్డేలు, టెస్టులకు ఇక ఫుల్ స్టాప్ పలికాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకొని జాసన్ బెహ్రెన్‌డార్ఫ్.. ప్రస్తుతం జాతీయ జట్టు ఎంపిక కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక బెహ్రెన్‌డార్ఫ్ గతేడాది చివరి మ్యాచ్ ఆడగా.. అది కూడా వెస్టిండిస్‌తో తలబడ్డాడు. బెహ్రెన్‌డార్ఫ్ 2019-2022 మధ్య ఆస్ట్రేలియా తరపున 12 వన్డేలు ఆడి.. 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే 17 టీ20 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తన పేరిట ఉన్నాయి.
తన కెరీర్‌లో ఓ అధ్యయనం ముగిసిందని.. ఈ 16 సంవత్సరాలు చాలా మధురమైన క్షణాలు అని జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ అన్నాడు. తాను పుట్టిన రాష్ట్రం తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడటం తన చిన్ననాటి కల అని.. అది నెరవేరిందని తెలిపాడు. దీని వల్లే తనకు ఆస్ట్రేలియా తరపున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ వచ్చిందన్నాడు. ఇదిలా ఉంటే.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. 19 సంవత్సరాల వయస్సులో డొమెస్టిక్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు ఈ ఫాస్ట్ బౌలర్. అతడు వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున 5 వన్డే ట్రోఫీలు గెలిచిన జట్టులో భాగస్వామిగా నిలిచాడు.
రోహిత్, విరాట్‌లను పడగొట్టాడు..
భారత గడ్డపై తన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు జాసన్ బెహ్రెన్‌డార్ఫ్. 2017లో గౌహతిలో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతడు ఒంటిచేత్తో భారత టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. టాప్ 4 వికెట్లు బెహ్రెన్‌డార్ఫ్ పడగొట్టాడు, వాటిలో రోహిత్, విరాట్ కోహ్లీ వికెట్లు ఉండటం గమనార్హం. వారిద్దరూ కలిసి ఆ మ్యాచ్‌లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశారు. ఇది అతడి టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు. బెహ్రెన్‌డార్ఫ్ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో పెద్ద విజయాన్ని అందుకుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




