AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: నేను బతికేదే అందుకోసం! టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీపై దృష్టి సారించారు. సెమీఫైనల్స్ చేరిన తరువాత, రిటైర్మెంట్ పుకార్లను తోసిపుచ్చుతూ, క్రికెట్ తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, అందుకే మరింత కాలం ఆడాలనుకుంటున్నట్లు తెలిపారు. వన్డే ఫార్మాట్ లో ఆయన పాత్ర, వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగడంపై అభిమానుల ఆశలు కూడా ఈ వ్యాసం వివరిస్తుంది.

Rohit Sharma: నేను బతికేదే అందుకోసం! టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
అదే సమయంలో, భారతదేశం తరపున అత్యధిక విజయాలు నమోదు చేసిన రికార్డు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉంది. అతను 332 మ్యాచ్‌ల్లో 178 గెలిచాడు. 213 మ్యాచ్‌ల్లో 135 విజయాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ రెండవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో మొహమ్మద్ అజారుద్దీన్ ఉన్నాడు. అతను 221 మ్యాచ్‌ల్లో 104 మ్యాచ్‌లను గెలిచాడు.
SN Pasha
|

Updated on: Feb 26, 2025 | 12:44 PM

Share

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఫోకస్‌ మొత్తం ఛాంపియన్స్‌ ట్రోఫీపైనే ఉంది. గ్రూప్‌ దశలో ఇంకో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై రోహిత్‌ సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. గ్రూప్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ మిగిలి ఉంది. అది గెలిస్తే గ్రూప్‌-ఏ టాపర్‌గా, ఓడితే సెకండ్‌ ప్లేస్‌లో భారత్ సెమీస్‌కు వెళ్తుంది. ఆ మ్యాచ్‌ తర్వాత ఓ రెండు మ్యాచ్‌లు వరుసగా గెలిస్తే.. రోహిత్‌ శర్మ ఛాంపియన్స్‌ ట్రోఫీని కూడా ఎత్తుతాడు. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జీవిస్తుందే క్రికెట్‌ కోసమని, నాకు క్రికెట్‌ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. జీవితంలో సంతోషం కావాలని ఎవరు కోరుకోర చెప్పండి అంటూ తెలిపాడు.

క్రికెట్‌ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పే క్రమంలో తాను సంతోషంగా జీవించేందుకు మరింత కాలం క్రికెట్‌ ఆడుతాననే విషయాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ మధ్య కాలంలో మరోసారి రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ గురించి ప్రచారం సాగుతున్న వేళ రోహిత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీ20 వరల్డ్‌ కప్‌ విజయంతో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్‌, ఇప్పుడు ఒక వేళ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిస్తే.. వన్డే ఫార్మాట్‌కు కూడా రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడనే ఊహాగానాలు క్రికెట్‌ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తన జీవితంలో క్రికెట్‌ సంతోషాన్ని ఇస్తుందని, అలాంటి సంతోషాన్ని ఎవరు కాదనుకుంటారు అంటూ రిటైర్మెంట్‌ పుకార్లకు ఒక విధంగా పుల్‌స్టాప్‌ పెట్టేశాడు. ఇప్పుడప్పుడే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించే ఉద్దేశం తనకు తేలదనే విషయాన్ని స్పష్టం చేశాడు.

కాగా, రోహిత్‌ శర్మ లాంటి ప్లేయర్‌ ప్రస్తుతం వన్డే టీమ్‌లో ఉండటం చాలా అవసరం. వన్డేలు టీ20లకు పూర్తి భిన్నం. కానీ, రోహిత్‌ శర్మ ఇస్తున్న ఆ ప్లైయింగ్‌ స్టార్ట్‌ టీమ్‌కు ఎంతో ప్లస్‌ అవుతుంది. తన వికెట్‌ పోయినా పర్వాలేదు పవర్‌ప్లేలో వీలైనన్ని ఎక్కువ రన్స్‌ చేయాలనే స్ట్రాటజీతో రోహిత్‌ వేగంగా ఆడుతున్నాడు. దాంతో ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లడం, మరో ఎండ్‌లో ఉన్న శుబ్‌ గిల్‌పై వేగంగా ఆడాలనే ప్రెజర్‌ లేకపోవడం, తర్వాత వచ్చే కోహ్లీకి ఇన్నింగ్స్‌ను బిల్డ్‌ చేసేందుకు కావాల్సినంత టైమ్‌ దొరుకుతుంది. ఇందంతా రోహిత్‌ ఆరంభంలో వేగంగా ఆడటం వల్ల జరుగుతుంది. అందుకే 2027 వన్డే వరల్డ్‌ కప్‌ వరకు రోహిత్‌ శర్మ వన్డే ఫార్మాట్‌లో కొనసాగాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.