Pushpa 2: పుష్ప 2 ట్రైలర్‌పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా..

ఇటీవల విడుదలైన పుష్ప 2 రూల్ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ ట్రైలర్‌ దేశవ్యాప్తంగా ప్రకంపనలు స్పష్టిస్తుంది. తాజాగా ఈ ట్రైలర్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్  స్పందించాడు.

Pushpa 2:  పుష్ప 2 ట్రైలర్‌పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా..
David Warner On Pushpa2
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 18, 2024 | 11:35 AM

పుష్ప 2 రూల్ ట్రైలర్ నెటింట్లో విధ్వంసం స్పష్టిస్తుంది.  సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ఈ ట్రైలర్ ఇప్పటికే రికార్డులను బద్దలు కొట్టింది. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 40 మిలియన్ల వీక్షణలను చేరుకుంది.  1.4 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా.. ఈ ట్రైలర్‌ గూర్చే మాట్లాడుకుంటున్నారు. అద్భుతమైన విజువల్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో విడుదలైన ఈ ట్రైలర్ నెటింట్లో మంటపెట్టింది.

పుష్ప 2: ది రూల్ నిర్మాతలు ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం బీహార్‌లోని పాట్నాలో విడుదల చేశారు. గ్రాండ్ ట్రైలర్‌లో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌గా చూపించగా, రష్మిక అతని ప్రేమికురాలిగా కనిపిస్తుంది. ట్రైలర్లో డ్రామా, మిస్టరీ, యాక్షన్, మ్యూజిక్, రొమాన్స్, కల్చర్ వంటి అన్ని అంశాలను డైరెక్టర్ సుకుమార్ కవర్ చేశాడు. పుష్ప: ది రైజ్‌లో తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న నటుడు ఫహద్ ఫాసిల్, పుష్ప: ది రూల్‌లో బలమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుంది. పుష్ప 2: ది రూల్ ట్రైలర్ చాలా ‘వైల్డ్’గా ఉందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే పుష్ప 2 ట్రైలర్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. గ్రేట్ వర్క్ అని ఇన్‌స్టాలో అల్లు అర్జున్‌ని ట్యాగ్ చేసి వార్నర్ బాయ్ అభినందించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!