AUS vs WI: ఈ దూకుడేందీ సామీ.. ఏకంగా 100 మీటర్ల భారీ సిక్స్‌.. 7 బంతుల్లోనే ఆటను మార్చేసిన లేటెస్ట్‌ సెన్సేషన్‌

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తాజాగా బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో కరేబియన్‌ జట్టును మట్టికరిపించింది.

AUS vs WI: ఈ దూకుడేందీ సామీ.. ఏకంగా 100 మీటర్ల భారీ సిక్స్‌.. 7 బంతుల్లోనే ఆటను మార్చేసిన లేటెస్ట్‌ సెన్సేషన్‌
Tim David
Follow us
Basha Shek

|

Updated on: Oct 08, 2022 | 7:15 AM

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచ కప్ సమరానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో కప్‌ ఎగరేసుకుని పోయేందుకు జట్లన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. తమ సన్నాహకాలకు తుది రూపాన్ని ఇస్తున్నాయి. బ్యాటర్లు తమ బ్యాట్లకు మరింత పదును పెడుతుంటే.. బౌలర్లు మరింత పర్ఫెక్షన్‌ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ టోర్నీలో డిపెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను నిలబెట్టుకోవాలనుకుంటోంది. పొట్టి ప్రపంచకప్‌కు సన్నాహకంగా వరుసగా టీ 20 మ్యాచ్‌లు ఆడుతోంది. ఇందులో భాగంగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. తాజాగా బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో కరేబియన్‌ జట్టును మట్టికరిపించింది. కాగా ఈ మ్యాచ్‌లో లేటెస్ట్‌ సెన్సేషన్‌ టిమ్‌ డేవిడ్‌ మరోసారి చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే 42 పరుగుల సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఏకంగా 110 మీటర్లు దూరం..

కాగా ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ (75) టాప్‌ స్కోరర్‌ అయినప్పటికీ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. కొద్దిరోజుల క్రితం ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. కరేబియన్‌ బౌలర్లను చిత్తు చేసి జట్టు స్కోరును 178 పరుగులకు చేర్చాడు. ముఖ్యంగా అతను ఆడిన షాట్లు క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ముఖ్యంగా ఓబెడ్ మెక్‌కాయ్ వేసిన 17వ ఓవర్‌లో రెండు, మూడో బంతులను సిక్స్‌లుగా మలిచాడు డేవిడ్‌. ఇందులో రెండో సిక్స్‌ నేరుగా 110 మీటర్ల దూరం ఉన్న స్టేడియంలోని స్టాండ్స్‌కు నేరుగా చేరుకుంది. ఈ భారీ సిక్స్‌ని చూసి కామెంటేటర్ల నుంచి నుంచి ప్రేక్షకుల వరకు ఆశ్చర్యపోయారు. ఈ రెండు సిక్స్‌లే కాదు.. ఈ ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు డేవిడ్‌. ఇలా కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేసిన అతను ఐదో బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. మిచెల్‌ స్టార్క్‌ (4/20) ధాటికి కుప్పకూలింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులు మాత్రమే చేసి 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో