AUS vs BAN Match Report: సెంచరీతో చెలరేగిన మిచెల్ మార్ష్.. బంగ్లాపై కంగారుల ఘన విజయం..
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం జరిగిన 43వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఆస్ట్రేలియాకు ఇది వరుసగా ఏడో విజయం. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు 307 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ICC World Cup Australia vs Bangladesh, 43rd Match Report:వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా శనివారం జరిగిన 43వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఆస్ట్రేలియాకు ఇది వరుసగా ఏడో విజయం. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు 307 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 44.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం..
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ మధ్య రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం ఉంది. ఇద్దరూ 116 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యానికి వార్నర్ వికెట్‌తో బ్రేక్‌పడింది. 53 పరుగుల వద్ద వార్నర్ ఔటయ్యాడు.
వార్నర్ హాఫ్ సెంచరీ..
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. అతను 61 బంతుల్లో 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్‌కు వన్డే కెరీర్‌లో ఇది 33వ కాగా, ఈ ప్రపంచకప్‌లో రెండో అర్ధ సెంచరీ.
పవర్‌ప్లేలో ఓ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..
పవర్‌ప్లే ఆరంభంలో బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించింది. మూడో ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత, ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్ చేపట్టి పవర్‌ప్లేలో ఆస్ట్రేలియా 50 మార్కును దాటించారు.
రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్..
View this post on Instagram
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లీష్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, షాన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), లిటన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా రియాద్, మెహదీ హసన్ మిరాజ్, తౌహీద్ హృదయ్, మెహదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, ముష్ఫికర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




