AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ENG vs PAK: సెమీస్ చేరాలంటే పాక్ టార్గెట్.. 38 బంతుల్లో 338 పరుగులు..

సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలంటే పాక్ జట్టు ఈ లక్ష్యాన్ని 38 బంతుల్లో అంటే 6.2 ఓవర్లలో ఛేదించాల్సి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 59 పరుగులు, జో రూట్ 60 పరుగులు, బెన్ స్టోక్స్ 84 పరుగులతో అర్ధ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ జోస్ బట్లర్ 27 పరుగులు, హ్యారీ బ్రూక్ 30 పరుగుల సహకారం అందించారు.

ENG vs PAK: సెమీస్ చేరాలంటే పాక్ టార్గెట్.. 38 బంతుల్లో 338 పరుగులు..
South Africa
Venkata Chari
|

Updated on: Nov 11, 2023 | 6:08 PM

Share

England vs Pakistan, 44th Match 1st Innings Highlights: ప్రపంచకప్ 2023లో తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీం పాకిస్థాన్‌కు 338 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమీఫైనల్‌లోకి ప్రవేశించాలంటే పాక్ జట్టు ఈ లక్ష్యాన్ని 38 బంతుల్లో అంటే 6.2 ఓవర్లలో ఛేదించాల్సి ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 59 పరుగులు, జో రూట్ 60 పరుగులు, బెన్ స్టోక్స్ 84 పరుగులతో అర్ధ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ జోస్ బట్లర్ 27 పరుగులు, హ్యారీ బ్రూక్ 30 పరుగుల సహకారం అందించారు.

పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు తీయగా, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ చెరో 2 వికెట్లు తీశారు. ఇఫ్తికార్ అహ్మద్‌కు ఒక వికెట్ దక్కింది.

బెయిర్‌స్టో 50 బంతుల్లో అర్ధ సెంచరీ..

ప్రస్తుత ప్రపంచకప్‌లో జానీ బెయిర్‌స్టో రెండో అర్ధశతకం సాధించాడు. అతని వన్డే కెరీర్‌లో ఇది 17వ అర్ధశతకం. 61 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను ప్రస్తుత ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌ల్లో 23.88 సగటుతో 215 పరుగులు చేశాడు.

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఔట్..

ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఔట్ అని టాస్ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. కాబట్టి పాకిస్తాన్‌ ఛేజింగ్ చేసే సమయంలో 16 నుంచి 22 బంతుల్లో లక్ష్యాన్ని సాధించాలి. ఇది అసాధ్యం. దీంతో, పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే ఇంటిముఖం పట్టనుంది.

పాకిస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు గెలిస్తే ఛాంపియన్స్‌ ట్రోఫీ టిక్కెట్‌ ఖాయం కానుంది.

స్టోక్స్-రూట్ సెంచరీ భాగస్వామ్యం..

మిడిల్ ఓవర్లలో జో రూట్, బెన్ స్టోక్స్ లను పాక్ బౌలర్లు విడదీయడంలో ఇబ్బంది పడ్డారు. వీరిద్దరి మధ్య 132 పరుగుల సెంచరీ భాగస్వామ్యం ఉంది. 11 నుంచి 40వ ఓవర్ల మధ్య ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేశారు. ఇద్దరూ అర్ధ సెంచరీలు సాధించారు. జో రూట్ ప్రపంచ కప్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు.

14వ ఓవర్లో డేవిడ్ మలన్ ఔట్ కాగా, 19వ ఓవర్లో జానీ బెయిర్ స్టో అవుటయ్యాడు. మిడిల్ ఓవర్లలో హరీస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్ వికెట్లు తీశారు.

రెండు జట్లలో ప్లేయింగ్-11..

పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రౌఫ్ .

ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, గుస్ అట్కిన్సన్.