Video: ఒంటి చేత్తో కావ్య పాప కెప్టెన్ కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ హిస్టరీలోనే అరుదు.. వీడియో చూస్తే ఫిదానే
Pat Cummins One - Handed Catch: ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్యాట్ కమిన్స్ చూపిన అద్భుతమైన ప్రతిస్పందన, అథ్లెటిక్ నైపుణ్యం క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్యాచ్ ద్వారా ప్యాట్ కమిన్స్ తన నాయకత్వ లక్షణాలను, మైదానంలో తన అద్భుతమైన కృషిని మరోసారి నిరూపించాడు.

క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరోసారి సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తన సొంత బౌలింగ్‌లో కేసీ కార్టీని అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఒంటి చేత్తో క్యాచ్ పట్టి క్రికెట్ అభిమానులకు బిగ్ షాకిచ్చాడు. ఈ క్యాచ్ “క్రికెట్ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుందని” నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
గ్రెనడాలోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 286 పరుగులు చేసింది. ఆ తర్వాత వెస్టిండీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. తొమ్మిదో ఓవర్‌లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌కు వచ్చాడు. అతని బంతి కార్టీ బ్యాట్ లోపలి అంచుకు తగిలి, ఆ తర్వాత అతని ప్యాడ్‌కు తగిలి గాలిలోకి లేచింది. బంతి షార్ట్ స్క్వేర్ మిడ్-వికెట్ వైపు వెళుతుండగా, అక్కడ ఎవరూ ఫీల్డర్ లేకపోవడంతో కార్టీ బతికిపోతాడని అందరూ అనుకున్నారు.
కానీ, కమిన్స్ సూపర్ మ్యాన్‌లా దూసుకువచ్చాడు. తన బౌలింగ్ ఫాలో-త్రూలో వేగంగా కుడివైపునకు పరుగెత్తి, ముందుకు దూకుతూ తన కుడి చేతిని చాచి, నేలకు కేవలం అంగుళాల దూరంలో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఇది నిజంగా అద్భుతమైన అథ్లెటిక్ ప్రయత్నం అనాల్సిందే. థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ కొద్దిసేపు పరిశీలించిన తర్వాత కార్టీ అవుట్‌గా ప్రకటించడంతో కామెంటేటర్లు “అద్భుతమైన క్యాచ్, ఆస్ట్రేలియా కెప్టెన్ నుంచి వచ్చిన అత్యుత్తమ అథ్లెటిక్ ప్రయత్నం” అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.
CUMMINS, YOU BEAUTY 🤯
Pat Cummins pulls off a diving, one-handed caught & bowled screamer to dismiss Keacy Carty 🔥#AUSvWI pic.twitter.com/0JxwJaz16t
— FanCode (@FanCode) July 4, 2025
ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్యాట్ కమిన్స్ చూపిన అద్భుతమైన ప్రతిస్పందన, అథ్లెటిక్ నైపుణ్యం క్రికెట్ ప్రపంచాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్యాచ్ ద్వారా ప్యాట్ కమిన్స్ తన నాయకత్వ లక్షణాలను, మైదానంలో తన అద్భుతమైన కృషిని మరోసారి నిరూపించాడు. ఈ అద్భుతమైన క్యాచ్ నిస్సందేహంగా గ్రెనడా టెస్టులోని ముఖ్యాంశాలలో ఒకటిగా మిగిలిపోతుంది.
ఈ మ్యాచ్‌లో కమిన్స్ 2 వికెట్లు తీసి 46 పరుగులిచ్చాడు. ఈ క్యాచ్ పట్టిన తర్వాత అతని చేతికి చిన్న గాయం కావడంతో కట్టు కట్టించుకోవలసి వచ్చింది. ఏదేమైనా, ఈ క్యాచ్ అతనిని నిజమైన సూపర్ మ్యాన్‌గా నిరూపించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..