“నన్ను చంపమని క్రిమినల్స్‌కు డబ్బులిచ్చాడు” – షమీ మాజీ భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు..
Mohammed Shami vs Hasin Jahan: మొహమ్మద్ షమీ, హసిన్ జహాన్‌లకు 2014లో వివాహం కాగా, వీరికి ఒక కుమార్తె ఉంది. కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో 2018 నుంచి విడిగా ఉంటున్నారు. హసిన్ జహాన్ అప్పట్లో షమీపై గృహహింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేయగా, బీసీసీఐ కూడా విచారణ జరిపింది.

Mohammed Shami vs Hasin Jahan: భారత క్రికెట్ స్టార్ మహమ్మద్ షమీ, అతని మాజీ భార్య హసిన్ జహాన్ మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ వివాదం మరోసారి భగ్గుమంది. కోల్‌కతా హైకోర్టు భరణంపై ఇటీవల కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో, హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. తనను వేధించడానికి షమీ క్రిమినల్స్‌ను నియమించుకున్నాడని ఆమె తీవ్రంగా ఆరోపించింది.
తాజాగా కోర్టు తీర్పు ప్రకారం, షమీ తన మాజీ భార్య హసిన్ జహాన్, కుమార్తెకు నెలకు రూ. 4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు అనంతరం హసిన్ జహాన్ మీడియాతో, సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ తన పోరాటానికి న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. అయితే, ఈ భరణం తమ జీవన శైలికి సరిపోదని, నెలకు రూ. 10 లక్షలు కావాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగానే ఆమె షమీపై తీవ్ర ఆరోపణలు చేసింది. “మమ్మల్ని అంతమొందించడానికి, పరువు తీయడానికి ఎంతమంది క్రిమినల్స్‌కు డబ్బులిచ్చావో? వేశ్యలకు, నేరస్థులకు ఇచ్చిన డబ్బును మన కుమార్తె భవిష్యత్తు కోసం ఖర్చు చేసి ఉంటే మన జీవితం గౌరవంగా ఉండేది” అని హసిన్ జహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేసింది. భగవంతుడు తనకు ఎంతో ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడని, అందుకే నిజం కోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని ఆమె పేర్కొంది. “పురుషాధిక్య సమాజంలో నిందలేసి నువ్వు మద్దతు పొందగలవేమో కానీ, ఏదో ఒకరోజు నీకూ కష్టకాలం తప్పదు. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది” అంటూ షమీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మొహమ్మద్ షమీ, హసిన్ జహాన్‌లకు 2014లో వివాహం కాగా, వీరికి ఒక కుమార్తె ఉంది. కొన్నాళ్లకే మనస్పర్థలు రావడంతో 2018 నుంచి విడిగా ఉంటున్నారు. హసిన్ జహాన్ అప్పట్లో షమీపై గృహహింస, కట్నం వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేయగా, బీసీసీఐ కూడా విచారణ జరిపింది. అయితే, బీసీసీఐ షమీకి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ వివాదం కోర్టులో కొనసాగుతోంది.
ఈ తాజా ఆరోపణలు షమీ వ్యక్తిగత జీవితాన్ని, అతని కెరీర్‌ను మరోసారి చర్చనీయాంశంగా మార్చాయి. దీనిపై షమీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. ఈ కేసు విచారణ ట్రయల్ కోర్టులో మరో ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..