Asia Cup 2023 PAK vs NEP Match Playing XI: తొలిసారి ‘ఢీ’.. పాక్-నేపాల్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఇదే.. బాబర్ సేనకు షాకిచ్చేనా?
Asia cup 2023 Pakistan vs Nepal match Preview: పాకిస్తాన్ జట్టు 2 సార్లు ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. నేపాల్ మొదటిసారి ఆసియా కప్‌నకు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నంబర్-1 జట్టుగా నిలిచింది. ఆసియా కప్‌నకు ముందు శ్రీలంకలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3–0తో గెలుచుకుంది.

Asia cup 2023 Pakistan vs Nepal match Preview: ఆసియా కప్-2023 నేటి నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు టాస్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభ వేడుకలో గాయకులు ఐమా బేగ్, త్రిషాలా గురుంగ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్ వర్సెస్ నేపాల్ జట్లు ముఖాముఖిగా తలపడనున్నాయి. ఇంతకు ముందు ఈ రెండు జట్లు క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనూ పోటీపడలేదు.




నేపాల్ మొదటిసారి అర్హత..
పాకిస్తాన్ జట్టు 2 సార్లు ఆసియా కప్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. నేపాల్ మొదటిసారి ఆసియా కప్‌నకు అర్హత సాధించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నంబర్-1 జట్టుగా నిలిచింది. ఆసియా కప్‌నకు ముందు శ్రీలంకలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 3–0తో గెలుచుకుంది.
నేపాల్‌కు పెద్ద జట్లతో ఆడిన అనుభవం తక్కువ. జట్టులోని ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేసినా అసోసియేట్ జట్లపైనే చేశారు.
ఫఖర్ జమాన్ ఈ ఏడాది పాకిస్థాన్ టాప్ స్కోరర్..
View this post on Instagram
2023లో వన్డే క్రికెట్‌లో పాకిస్థాన్ తరపున ఫఖర్ జమాన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను 11 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలతో 579 పరుగులు చేశాడు. అతని తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం నంబర్ వస్తుంది. 2023లో 538 పరుగులు చేశాడు.
ఈ ఏడాది బౌలింగ్‌లో హరీస్ రవూఫ్, నసీమ్ షా అద్భుత ప్రదర్శన చేశారు. ఇద్దరూ తలో 15 వికెట్లు తీశారు. మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ తన ప్లేయింగ్-11ని విడుదల చేసింది. జట్టు తన పూర్తి శక్తితో నేపాల్‌తో తలపడనుంది.
ఈ ఏడాది అదరగొట్టిన కుశాల్ భుర్టెల్..
నేపాల్ 2023 సంవత్సరంలో కుశాల్ భుర్టెల్ నుంచి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 19 మ్యాచ్‌ల్లో 544 పరుగులు చేశాడు. అతనితో పాటు కుశాల్ మాల 19 మ్యాచ్‌ల్లో 541 పరుగులు చేశాడు. బౌలర్లలో సందీప్ లమిచానే పేరు అగ్రస్థానంలో ఉంది. లామిచానే 19 వన్డేల్లో 42 వికెట్లు తీశాడు.
వాతావరణ పరిస్థితి..
ముల్తాన్‌లో బుధవారం చాలా సమయం వరకు ఎండగా ఉంటుందని భావిస్తున్నారు. ఉష్ణోగ్రత 29 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. వర్షం పడే అవకాశం 1%గా ఉంది.
పిచ్ రిపోర్ట్..
View this post on Instagram
ముల్తాన్ క్రికెట్ స్టేడియం పిచ్ హై స్కోరింగ్ పిచ్‌గా పేరుగాంచింది. ఈ పిచ్‌లో బ్యాట్స్‌మెన్‌కు మంచి సహకారం అందుతుంది. ఈ మైదానం సరిహద్దు చిన్నదిగా ఉంది. ఈ పిచ్‌పై బౌలింగ్ చేయడం అంత సులువు కాదు. అయితే ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కొంత సాయం అందుతుంది.
ముల్తాన్‌లో మొత్తం 10 వన్డేలు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 5 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రెండో బ్యాటింగ్ చేసిన జట్టు 05 మ్యాచ్‌లు గెలిచింది.
ఇరు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI…
పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్
నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, అర్జున్ సౌద్, ఆసిఫ్ షేక్, దీపేందర్ సింగ్ ఐరీ, భీమ్ షార్కీ, కరణ్ కెసి, కుశాల్ మాలా, సందీప్ లామిచానే, లలిత్ రాజ్‌బన్షి, గుల్షన్ ఝా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




