Ind vs Pak: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత్- పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
Ind vs Pak, Asia Cup 2022: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత్-పాకిస్తాన్‌ల క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం(ఆగస్టు 28) రాత్రి 7.30 దాయాదుల మధ్య రసవత్తర పోరు జరగనుంది.
Ind vs Pak, Asia Cup 2022: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారత్-పాకిస్తాన్‌ల క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం(ఆగస్టు 28) రాత్రి 7.30 దాయాదుల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఆదివారం కావడంతో చాలామంది ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా ఆసియా కప్-2022 టోర్నీ మ్యాచ్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఇక స్మార్ట్‌ఫోన్స్‌లో అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ లైవ్ చూడొచ్చు. అయితే ఈ రెండు మాధ్యమాల్లోనూ మ్యాచ్‌లు చూడాలంటే తగినంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌స్ర్కి్‌ప్షన్ ఉన్నవారు ఎంచెక్కా అరచేతిలో మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అయితే ఈ మ్యాచ్‌ను టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటున్న వారికి ఒక గుడ్‌న్యూస్.. అదేంటంటే.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ ఆధ్వర్యంలో ఉన్న డీడీ స్పోర్ట్స్,అయితే, మెగా టోర్నీ మ్యాచ్‌లను టీవీలో ఫ్రీగా చూడాలనుకుంటున్న దేశీవాసులకు మాత్రం ఓ గుడ్‌న్యూస్! అదేమిటంటే.. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ ఆధ్వర్యంలోని డీడీ స్పోర్ట్స్, డీడీ ఫ్రీడిష్‌లో ఉచితంగా ఈ మ్యాచ్‌ను చూడవచ్చు. టీమిండియా, పాక్ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్ టోర్నీ మ్యాచ్‌లన్నింటినీ ఇక్కడ ఫ్రీగా లైవ్ లో చూడొచ్చని దూరదర్శన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. టీమిండియా డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆదివారం పాక్‌తో మ్యాచ్‌తో ఈ మల్టీనేషన్ టోర్నమెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు భారత్‌పై గెలిచి మేజర్ ఈవెంట్లలో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవాలని పాక్ భావిస్తోంది. దిగ్గజ బ్యాటర్లు, బౌలర్లు ఉండడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.
It’s momentous. It’s legendary. It’s epic.? #AsiaCup2022 #INDvPAK
— Doordarshan Sports (@ddsportschannel) August 24, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..