IND vs SL: ‘రోహిత్, కోహ్లీలను పక్కన పెట్టండి..’: గంభీర్ కోచింగ్‌పై ఆశిష్ నెహ్రా షాకింగ్ కామెంట్స్
Gautam Gambhir - Ashish Nehra: ఐపీఎల్‌లో, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కీలక ప్రకటన ఇచ్చారు. గౌతమ్ గంభీర్ వ్యూహంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఆశిష్ నెహ్రా ప్రకారం, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని ఆడించాల్సిన అవసరం లేదు.
Gautam Gambhir – Ashish Nehra: ఐపీఎల్‌లో, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా టీమిండియా కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కీలక ప్రకటన ఇచ్చారు. గౌతమ్ గంభీర్ వ్యూహంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఆశిష్ నెహ్రా ప్రకారం, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని ఆడించాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లను మాత్రమే ప్రయత్నిస్తే బాకుంటుందని నెహ్రా చెప్పుకొచ్చాడు.
టీ20 ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి ఈ ఇద్దరు దిగ్గజాలు తిరిగి వస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, గౌతమ్ గంభీర్ కోచ్ అయిన వెంటనే ఈ ఇద్దరి ఆటగాళ్లను శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడేందుకు పిలిచాడు.
గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి – ఆశిష్ నెహ్రా..
సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో జరిగిన సంభాషణలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ, ఈ సిరీస్‌లో గౌతమ్ గంభీర్ యువ ఆటగాళ్లను మాత్రమే ప్రయత్నించాలి. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆడించాల్సిన అవసరం లేదు.
‘గౌతమ్ గంభీర్ విదేశీ కోచ్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు అతనికి బాగా తెలుసు. ఈ కారణంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ పద్ధతి తప్పు అని నేను అనడం లేదు. కానీ, ఈ వ్యూహం వేరుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
రెండో వన్డేలో భారత జట్టు ఓటమి..
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్‌లో పరుగుల ఛేదనలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ కారణంగానే భారత జట్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహం, ఎలాంటి పొరపాట్లు చేశాడనే దానిపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. టీమ్ కాంబినేషన్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..