Viral Video: వామ్మో.. ఇదేం డేంజరస్ బాల్ బ్రదరూ.. బ్యాటర్‌కే మైండ్ దొబ్బిందిగా.. వీడియో చూస్తే వణుకే..
Ashes 2023, England vs Australia 1st Test: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నాలుగో రోజు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుత యార్కర్ అందరి హృదయాలను గెలుచుకుంది. అతని బంతికి ఒల్లీ పోప్ వద్ద సమాధానం లేదు.
Patt Cummins Video: ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఓ వైపు ఇంగ్లండ్ బ్యాటింగ్, ఫీల్డింగ్ గురించి చర్చ జరుగుతుండగా మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. బ్యాటింగ్‌లో, ఉస్మాన్ ఖవాజా అద్భుత సెంచరీతో ఇంగ్లాండ్‌కు సమాధానం ఇవ్వగా, ఆట నాల్గవ రోజు కంగారూ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంగ్లాండ్ శిబిరంలో వణుకు పుట్టించాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో పాట్ కమ్మిన్స్ అద్భుతమైన యార్కర్ బంతిని విసిరి ఆలీ పోప్ స్టంప్‌లను చెల్లా చెదురు చేశాడు.
పాట్ కమ్మిన్స్ వేసిన ఈ బంతి ఎంత అద్భుతంగా ఉందో, అంతే డేంజరస్‌గానూ ఉంది. బంతి స్టంప్‌లను ఎప్పుడు పడగొట్టిందో పోప్‌కు తెలియదు. పాట్ కమ్మిన్స్ క్రీజులో కోణాన్ని ఉపయోగించాడని, ఈ బంతి గాలిలో స్వింగ్ చేస్తూ లోపలికి వచ్చి ఆలీ పోప్ ఆఫ్ స్టంప్‌లను పడగొట్టింది.
కమిన్స్ బాల్ రివర్స్ స్వింగ్..
నాలుగో రోజు ఆట నిజంగా అద్భుతంగా ప్రారంభమైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ నాలుగో రోజు మొదటి బంతికే రివర్స్ స్కూప్ ఆడడం ద్వారా తన ఉద్దేశాలను స్పష్టం చేశాడు. అతను బంతిని కనెక్ట్ చేయనప్పటికీ, అతను మళ్లీ ఆరో బంతికి అదే షాట్ ఆడాడు. బంతి సిక్సర్‌గా మారింది. ఆ తర్వాత 46 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. పాట్ కమిన్స్ రివర్స్ స్వింగ్ యార్కర్ 17వ ఓవర్‌లో అతని ఆటను ముగించింది.
View this post on Instagram
ఉత్కంఠగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టు..
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ చాలా ఉత్కంఠ దశకు చేరుకుంది. నాలుగో రోజు లంచ్ వరకు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. జో రూట్ వేగంగా 46 పరుగులు చేసి ఆ తర్వాత హ్యారీ బ్రూక్ కూడా వేగంగా ఆడాడు. అయితే రిస్కీ షాట్ ఆడుతూ అతని ఇన్నింగ్స్ కూడా ముగిసింది. లయన్ బ్రూక్, రూట్ ఇద్దరి వికెట్లు తీశాడు. బ్రూక్ గుడ్ లెంగ్త్ బాల్‌ను ఫోర్స్‌ఫుల్ షార్ట్ చేయడానికి ప్రయత్నించి లాబుషెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే రూట్ లాంగ్ సిక్స్ కొట్టే ప్రయత్నంలో స్టంపౌట్ అయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..