Video: విరాట్ నువ్వు లేకుండా ఆడాలంటే సిగ్గుగా ఉంది! కింగ్ రిటైర్మెంట్ పై ఛాంపియన్ ప్లేయర్ ఎమోషన్..
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై ప్రపంచ క్రికెట్ స్పందిస్తోంది. బెన్ స్టోక్స్ ఈ నిర్ణయంపై తన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తూ, కోహ్లీతో ఇక ఆడలేకపోవడమే సిగ్గుగా ఉందని అన్నాడు. కోహ్లీ పోరాట స్పూర్తి, కవర్ డ్రైవ్ స్టైల్, అతని గెలుపు పట్ల ఉన్న పట్టుదలను గుర్తు చేస్తూ ప్రశంసించాడు. కోహ్లీ రిటైర్మెంట్ భారత జట్టులో అనుభవ లోటుని తేల్చేస్తోంది. కోహ్లీ మైదానంలో చూపే పోరాట స్పూర్తి, అతని అసాధారణమైన పోటీతత్వం, గెలుపుపై అతని పట్టుదల భారత జట్టుకు ఎంతో అవసరమని, అది ఇకపై మిస్సవుతుందని చెప్పాడు.

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అందులో ముఖ్యంగా ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందన మరింత హృదయాన్ని తాకేలా ఉంది. టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ గుడ్‌బై చెప్పిన కొద్ది రోజులకే స్టోక్స్ అతనికి సందేశం పంపి, “ఈసారి అతనితో ఆడకపోవడం సిగ్గుచేటు…” అంటూ తన విచారాన్ని వ్యక్తం చేశారు. మైదానంలో కోహ్లీతో తాను పంచుకున్న పోటీతత్వం, అతనితో తలపడే ప్రతీ క్షణం ఒక యుద్ధంలా ఉండేదని స్టోక్స్ పేర్కొన్నారు. ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో ఒకే మైండ్‌సెట్‌తో ఉంటారన్న విషయాన్ని గుర్తుచేసిన ఆయన, విరాట్‌తో ఆడిన ప్రతి మ్యాచ్ తనకు స్పెషల్ అని అన్నారు.
మే 12న కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది అనూహ్యంగా జరిగింది. అదే సమయంలో జూన్ 20న ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత్ సిద్ధమవుతుండటం వలన ఈ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాక, భారత టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ఈ ఫార్మాట్‌కి వీడ్కోలు చెప్పడంతో, కోహ్లీ రిటైర్మెంట్ భారత జట్టును మరింత అనుభవం లేని స్థితిలోకి నెట్టింది. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని ముందే తెలుసుకుందన్న వార్తలున్నా, కోహ్లీని పునఃపరిశీలించమని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. “ఈ నిర్ణయం తీసుకోవడం సులభం కాదు, కానీ అది సరైనదిగా అనిపిస్తుంది” అని కోహ్లీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
కోహ్లీ రిటైర్మెంట్‌పై స్టోక్స్ ప్రగాఢంగా స్పందించాడు. కోహ్లీ మైదానంలో చూపే పోరాట స్పూర్తి, అతని అసాధారణమైన పోటీతత్వం, గెలుపుపై అతని పట్టుదల భారత జట్టుకు ఎంతో అవసరమని, అది ఇకపై మిస్సవుతుందని చెప్పాడు. “విరాట్ 18వ నంబర్‌ను తనదిగా మార్చుకున్నాడు. ఇక ఆ నంబరును మరొక భారత క్రికెటర్ వీరి స్థాయిలో ధరించడం చూసే అవకాశం ఉండదేమో. అతను నిజంగా తరగతికి నిలువెత్తు ఉదాహరణ” అని స్టోక్స్ కొనియాడాడు.
అంతేకాక, రెడ్ బాల్ ఫార్మాట్‌లో కాక, వైట్ బాల్ ఫార్మాట్‌లలో కోహ్లీని ఒక ‘వేరే మృగం’ అని స్టోక్స్ ప్రశంసించాడు. అతని బ్యాటింగ్ శైలి గురించి మాట్లాడుతూ, “విరాట్ కవర్ ద్వారా బంతిని ఎంత గట్టిగా కొడతాడో నాకు ఇప్పటికీ గుర్తుంది. అతని కవర్ డ్రైవ్ అంటే ప్రత్యేక గుర్తింపు. అది ఎన్నేళ్లైనా అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది” అంటూ తన అభిమానం వ్యక్తం చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కోహ్లీ, అన్ని ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసి, లక్షలాది మంది అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించాడు. స్టోక్స్ లాంటి ప్రత్యర్థి క్రికెటర్ నుండి వచ్చిన ఈ ప్రశంసలు కోహ్లీ ప్రతిష్టను ఇంకొంచెం ఎక్కువ చేస్తాయి.
View this post on Instagram
BEN STOKES ON VIRAT KOHLI'S TEST RETIREMENT. 🗣️
"I texted Kohli after his Test retirement, I told him it's such a shame that you won't be here in England". pic.twitter.com/8uScTjO7On
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 21, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



