Shah Rukh Khan: సారీ చెప్పిన షారుక్ ఖాన్.. స్పందించిన ఆండ్రీ రస్సెల్.. ఎందుకో తెలుసా..
Andre Russell reacts to Shah Rukh Khan: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ప్రదర్శనపై ఆ జట్టు యజమాని షారుక్ ఖాన్ సీరియస్‌గా స్పందించాడు. తమ జట్టు నిరుత్సాహ ప్రదర్శనపై అభిమానులకు క్షమాపణలు కోరాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పది పరుగుల స్వల్ప తేడాతో
IPL 2021: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు ప్రదర్శనపై ఆ జట్టు యజమాని షారుక్ ఖాన్ సీరియస్‌గా స్పందించాడు. తమ జట్టు నిరుత్సాహ ప్రదర్శనపై అభిమానులకు క్షమాపణలు కోరాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో పది పరుగుల స్వల్ప తేడాతో ముంబైపై ఓడింది కేకేఆర్ జట్టు.
ఈ మ్యాచ్‌లో ముందుగా ముంబైని కేవలం 152 పరుగులకే కట్టడి చేసింది కోల్‌కతా. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ ఐదు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అనంతరం బరిలోకి దిగిన మోర్గన్ సేన టార్గెట్‌కు పది పరుగుల దూరంలో ఆగిపోయింది. ముంబై బౌలర్ రాహుల్ చాహర్.. నాలుగు వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే షారుక్ చేసిన ట్వీట్‌కు కోల్‌కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ స్పందించాడు. షారుక్ ట్వీట్‌ను సమర్థిస్తాను అంటు పేర్కొన్నాడు. ఏదేమైనా క్రికెట్ అంటే ఇలాగే ఉంటుంది. ఆట ముగిసే వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేం. మేం అద్భుతమైన క్రికెట్ ఆడాం. కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాం అంటూ పేర్కొన్నాడు. ఓటమికి నిరాశ చెందాం. కానీ ఇదే ముగింపు కాదు కదా అంటూ రాసుకొచ్చాడు. మాకిది రెండో మ్యాచే. పొరపాట్ల నుంచి మేం నేర్చుకుంటాం. నేను వందల టీ20 మ్యాచులు ఆడాను. చాలాసార్లు ఆధిపత్యం చెలాయించిన జట్లు హఠాత్తుగా ఓడిపోవడం చూశాను. మంగళవారం రాత్రీ అదే జరిగింది. జట్టులో మార్పులు చేసుకొని మరింత మెరుగవుతాం అంటూ రస్సెల్ ట్వీట్ చేశాడు.