67 బంతుల్లో పెను విధ్వంసం.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో బౌలర్ల భరతం పట్టాడు.. ఎవరో తెలుసా?
లంక ప్రీమియర్ లీగ్ ఇలా మొదలైందో.. లేదో.. పరుగుల వరద పారుతోంది. వెస్టిండీస్‌కు చెందిన 35 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఆండ్రీ ఫ్లెచర్ సెంచరీతో అదరగొట్టాడు.

లంక ప్రీమియర్ లీగ్ ఇలా మొదలైందో.. లేదో.. పరుగుల వరద పారుతోంది. వెస్టిండీస్‌కు చెందిన 35 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఆండ్రీ ఫ్లెచర్ సెంచరీతో అదరగొట్టాడు. ఒంటరిగా ప్రత్యర్ధులపై వీరవిహారం చేశాడు. ఫ్లెచర్‌తో పాటు మరో ఓపెనర్ కూడా హాఫ్ సెంచరీ సాధించడంతో.. వీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్టు ఈజీగా విజయాన్ని అందుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇటీవల క్యాండీ ఫాల్కన్స్, కొలంబో స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ ఫ్లెచర్ క్యాండీ ఫాల్కన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ ఫాల్కన్స్ 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 199 పరుగులు చేసింది. ఆండ్రీ ఫ్లెచర్(102), పథమ్ నిస్సాంక(71) కలిసి మొదటి వికెట్‌కు 15.4 ఓవర్లలో 156 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిశాంకా ఔట్ అయినా కూడా.. ఫ్లెచర్ చివరి వరకు అజేయంగా నిలిచాడు. తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
67 బంతుల్లో 3 సిక్సర్లు, 11 ఫోర్లతో సెంచరీ..
కొలంబో స్టార్స్‌పై ఆండ్రీ ఫ్లెచర్ 67 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 102 పరుగులు చేశాడు. అంటే మొత్తంగా 14 బౌండరీలతో అదరగొట్టిన అతడి ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ 152.23గా ఉంది. కాగా, క్యాండీ ఫాల్కన్స్ నిర్దేశించిన టార్గెట్‌ను కొలంబో స్టార్స్ చేధించలేకపోయింది. 14.3 ఓవర్లలో కేవలం 90 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో సహా 14 పరుగులకు 4 వికెట్లు పడగొట్టిన వానిందు హసరంగా క్యాండీ ఫాల్కన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ ఆండ్రీ ఫ్లెచర్‌కు దక్కింది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..




