Marsden Cricket Club: ఇంగ్లండ్ లో158 పురాతన క్రికెట్ క్లబ్‌లో ఆంధ్రా వాసి.. ఓపెనింగ్ బౌలర్ గా సెలెక్ట్

అమృత్ వర్ధన్ స్పోర్ట్స్ బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీని మరియు మరో మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లో యూకే లోని లీడ్స్ లో పూర్తి చేసారు. అమృత్ చిన్నతనం నుండే క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ లో వివిధ రకాల స్కూల్స్ కాలేజెస్ టోర్నీ లలో పాల్గొనేవారు.

Marsden Cricket Club: ఇంగ్లండ్ లో158 పురాతన క్రికెట్ క్లబ్‌లో ఆంధ్రా వాసి.. ఓపెనింగ్ బౌలర్ గా సెలెక్ట్
Chappidi Amruth Vardhan
Follow us

|

Updated on: Mar 06, 2023 | 7:35 PM

క్రికెట్ కు జన్మస్థానం అయిన ఇంగ్లాండులో అత్యంత పురాతనమైన క్రికెట్ క్లబ్.. మార్స్ డెన్ క్లబ్. ఈ క్రికెట్ క్లబ్ 158 పురాతన క్రికెట్ క్లబ్ గా ఖ్యాతిగాంచింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మార్స్ డెన్ క్లబ్ లో ఓపెనింగ్ బౌలర్ గా ఆంధ్రావాసి ఎంపికయ్యాడు. తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ కుమారుడు అమృత్ వర్ధన్ సెలెక్ట్ అయ్యారు.

ఈ క్లబ్ 158 ఏళ్ల క్రితం అనగా 1865 లో మొదలైంది. ఈ టీము ఇంగ్లాండ్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన లీగ్ అయినటువంటి “హడార్స్ ఫీల్డ్” క్రికెట్ లీగ్ లో మొత్తం 12 టీములతో 22 మచ్ లు ఇంగ్లండ్లోని వివిధ పట్టణాలలో ఆడనున్నారు.

అమృత్ వర్ధన్ స్పోర్ట్స్ బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్ డిగ్రీని మరియు మరో మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ లో యూకే లోని లీడ్స్ లో పూర్తి చేసారు. అమృత్ చిన్నతనం నుండే క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ లో వివిధ రకాల స్కూల్స్ కాలేజెస్ టోర్నీ లలో పాల్గొనేవారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని లీడ్స్ లో నివాసం ఉంటూ అక్కడ పలు రకాల క్లబ్ లలో క్రికెట్ మరియు ఫుట్బాల్ టోర్నీలలో ఆడుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..