ICC ODI World Cup 2023: ప్రపంచ కప్ 2023లో సెమీస్ చేరేది ఈ 4 జట్లే.. జోస్యం చెప్పేసిన భారత మాజీ సారథి..
ODI World Cup 2023: భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారతదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ 2023పై తన ప్రిడిక్షన్ చెప్పేశాడు. అక్టోబరు 5 నుంచి భారత్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆతిథ్య భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవచ్చని గంగూలీ పేర్కొన్నాడు.
Sourav Ganguly Predictions on ODI World Cup 2023: భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారతదేశంలో జరగబోయే వన్డే ప్రపంచ కప్ 2023పై తన ప్రిడిక్షన్ చెప్పేశాడు. అక్టోబరు 5 నుంచి భారత్‌లో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో ఆతిథ్య భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకోవచ్చని గంగూలీ పేర్కొన్నాడు. ఇది కాకుండా, గంగూలీ నాల్గవ జట్టు కోసం న్యూజిలాండ్ లేదా పాకిస్తాన్ పేరును చెప్పుకొచ్చాడు.
ప్రపంచకప్ 2023లో సెమీఫైనల్‌కు చేరుకోవడానికి భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నా మొదటి ఎంపిక అని సౌరవ్ గంగూలీ రెవ్‌స్పోర్ట్జ్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. పెద్ద ఈవెంట్లలో న్యూజిలాండ్ జట్టును తేలికగా తీసుకోలేం. ఇటువంటి పరిస్థితిలో సెమీ-ఫైనల్ రేసులో 5 జట్లను పరిశీలిస్తాను. ఇందులో పాకిస్థాన్‌ను కూడా చేర్చాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
పాకిస్థాన్ అర్హత సాధిస్తే, ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇరు జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌ను భారత అభిమానులు చూడొచ్చని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్‌కు చేరితే కోల్‌కతాలోనే ఆడనుంది.
లోకల్ ఈవెంట్‌తో ఒత్తిడిలో భారత ఆటగాళ్లు..
భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి భారత ఆటగాళ్లపై పెద్దగా మానసిక ఒత్తిడి ఉండదు. ఎందుకంటే అందరూ చాలా బలంగా కనిపిస్తారు. అయితే ఈసారి స్వదేశంలో టోర్నీ జరగడం వల్ల వారిపై కొంత ప్రదర్శన ఒత్తిడి కచ్చితంగా కనిపించవచ్చు.
ఒత్తిడి ఎప్పుడూ భారత్ పైనే ఉంటుందని గంగూలీ చెప్పుకొచ్చాడు. ముఖ్యంలో స్వదేశంలో ఆడుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి ఉండేది. గత వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ 5 సెంచరీలు సాధించాడు . అతనిపై కూడా ఒత్తిడి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఒత్తిడి సమస్య కాదు. అతను దీని నుంచి ఒక మార్గాన్ని కనుగొంటాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రాహుల్ ద్రవిడ్ ఆడేటప్పుడు ప్రదర్శన చేయాలనే ఒత్తిడి ఉండేది. ఇప్పుడు అతను ప్రధాన కోచ్‌గా ఉన్నందున, అతను జట్టు ప్రదర్శన కోసం ఒత్తిడికి గురవుతాడు. మేం కొన్నిసార్లు ముఖ్యమైన మ్యాచ్‌లలో బాగా రాణించలేం. ఇది మానసిక ఒత్తిడి కాదని నా అభిప్రాయం. అందరూ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. ఈసారి మనం మరింత మెరుగ్గా రాణిస్తామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..