Eoin Morgan: క్రికెట్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోర్గాన్‌.. ఇండియాతో సిరీస్‌ నుంచి కొత్త అవతారంలో..

Eoin Morgan: కెప్టెన్‌గా ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొన్నేళ్లుగా ఫామ్‌లేమి, ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతోన్న ఈ స్టార్‌ క్రికెటర్‌ ఆటకు గుడ్‌బై చెప్పాడు.

Eoin Morgan: క్రికెట్‌లో సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మోర్గాన్‌.. ఇండియాతో సిరీస్‌ నుంచి కొత్త అవతారంలో..
Eoin Morgan

Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 9:02 AM

Eoin Morgan: కెప్టెన్‌గా ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొన్నేళ్లుగా ఫామ్‌లేమి, ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతోన్న ఈ స్టార్‌ క్రికెటర్‌ ఆటకు గుడ్‌బై చెప్పాడు. తన బ్యాటింగ్‌తో పాటు సారథిగా ఇంగ్లండ్‌ జట్టుకు 13 ఏళ్ల పాటు ఎనలేని సేవలు అందించాడు మోర్గాన్‌. 2019 వన్డే ప్రపంచకప్‌లో జట్టును మొదటిసారిగా విశ్వవిజేతగా నిలిపి ఇంగ్లండ్‌ విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే తన భవిష్యత్‌ ప్రణాళికలను వెల్లడించాడీ స్టార్‌ ప్లేయర్‌. త్వరలో స్వదేశంలో జరిగే ఇండియాతో సిరీస్‌ నుంచి కామెంటేటర్‌గా మారబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ విషయాన్ని మోర్గాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న స్కై నెట్‌వర్క్ కూడా ధృవీకరించింది. మోర్గాన్ తమ కామెంటరీ బృందంలో చేరబోతున్నాడని ఓ ప్రకటన విడుదల చేసింది.

స్వదేశంలో ఇంగ్లండ్‌ ఆడబోయే తదుపరి సిరీస్‌ల నుంచి మోర్గాన్‌ స్కై నెట్‌వర్క్‌లో భాగస్వామిగా మారనున్నాడు. అంటే త్వరలో జరుగబోయే ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌ల నుంచి కామెంటేటర్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టనున్నాడీ మాజీ కెప్టెన్‌. ఇక ఐర్లాండ్‌ తరఫున కెరీర్‌ ఆరంభించి ఆ తర్వాత ఇంగ్లండ్‌ జట్టుకు మారాడు మోర్గాన్‌. ఏడేళ్ల పాటు ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా సేవలందించిన అతను తన కెరీర్‌ మొత్తంలో16 టెస్ట్‌లు, 248 వన్డేలు, 115 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో 2 శతకాలు, 3 అర్ధశతకాల సాయంతో 700 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో 14 సెంచరీలు, హాఫ్‌ సెంచరీల సాయంతో 7, 701 రన్స్‌ చేశాడు. టీ20ల్లో 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 2, 458 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..