Asian Games 2023: ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకు పాకిస్తానీలు విలవిల.. భారత్‌తో ఫైనల్ ఆడేది ఎవరంటే?
India vs Afghanistan, Asian Games 2023 Final: ఆసియా క్రీడల సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఓడిపోయింది. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాక్ జట్టు కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడు ఫైనల్లో స్వర్ణ పతకం కోసం భారత్, ఆఫ్ఘనిస్థాన్ పోటీపడనున్నాయి. అంతకుముందు సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ స్వర్ణ పతక పోరులో నిలిచింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలో సులభంగా సాధించింది.

Asian Games 2023: ఆసియా క్రీడల క్రికెట్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న పాకిస్థాన్ కల చెదిరిపోయింది. హాంగ్‌జౌ వేదికగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 18 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆఫ్ఘన్ జట్టు 17.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని సాధించింది. ఇప్పుడు స్వర్ణ పతక పోరులో భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శనివారం జరగనుంది.
పాకిస్థాన్ జట్టు ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో ఘోర పరాజయం పాలైంది. నాకౌట్ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణయం ఖచ్చితంగా సరైనదేనని తేలింది. పాకిస్థాన్ ఓపెనర్ మీర్జా బేగ్ 4 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. వికెట్ కీపర్ రోహైల్ నజీర్ కూడా 10 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. హైదర్ అలీ 2 పరుగులు, కెప్టెన్ ఖాసిమ్ అక్రమ్-9, ఖుష్దిల్ షా- 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసిఫ్ అలీ 8 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో పాక్ జట్టు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది.




సత్తా చాటిన ఆఫ్ఘనిస్తాన్..
View this post on Instagram
ఆఫ్ఘనిస్థాన్ జట్టు కేవలం 116 పరుగులకే ఆలౌటైంది. కానీ, హాంగ్‌జౌ కష్టమైన పిచ్‌పై ఈ పరుగులు కూడా సరిపోతాయి. అఫ్గాన్ జట్టు ఆరంభం కూడా ఫర్వాలేదు. ఓపెనర్లు సెడికల్లా అటల్, మహ్మద్ షాజాద్ 9 పరుగుల వద్ద ఔటయ్యారు. షాహిదీవుల్లా కమల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. నూర్ అలీ జద్రాన్ 33 బంతుల్లో 39 పరుగులు, కెప్టెన్ గుల్బాదిన్ నై 19 బంతుల్లో నాటౌట్ 26 పరుగులు చేసి ఆఫ్ఘనిస్థాన్‌ను ఫైనల్‌కు చేర్చారు.
భారత్‌కు గట్టి పోటీ..
View this post on Instagram
అంతకుముందు సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి భారత్ స్వర్ణ పతక పోరులో నిలిచింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ జట్టు కేవలం 96 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యాన్ని కేవలం 9.2 ఓవర్లలో సులభంగా సాధించింది. తిలక్ వర్మ 55 పరుగులతో అజేయంగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడారు. బౌలింగ్‌లో సాయి కిషోర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఆటగాడు 4 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
