AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంకెన్నాళ్లు.. వరుసగా 10 టెస్టులు, 3 ఏళ్లుగా నిరాశే: గంభీర్‌ను ఏకిపారేసిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్ తండ్రి

'నా కొడుకు కొంచెం నిరాశకు గురయ్యాడు. కొంతమంది ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడటం ద్వారా టెస్ట్ జట్టులోకి ఎంపిక చేస్తారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడు, ఐపీఎల్ ప్రదర్శనను లెక్కించకూడదు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ టెస్ట్ ఎంపికకు ఆధారం కావాలి' అని అతను తెలిపాడు.

ఇంకెన్నాళ్లు.. వరుసగా 10 టెస్టులు, 3 ఏళ్లుగా నిరాశే: గంభీర్‌ను ఏకిపారేసిన టీమిండియా బ్యాడ్‌లక్ ప్లేయర్ తండ్రి
Ind Vs Eng 4th Test Abhiman
Venkata Chari
|

Updated on: Aug 01, 2025 | 8:32 PM

Share

Abhimanyu Easwaran: ఇంగ్లాండ్ పర్యటనలో టెస్టులు ఆడటానికి అభిమన్యు ఈశ్వరన్ ఎంతో కాలంగా వేచి చూస్తున్నాడు. జూన్ 20న ప్రారంభమైన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ జులై 31న ప్రారంభమైంది. కానీ, ఈశ్వరన్ ఏ మ్యాచ్‌లోనూ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం కాలేదు. ఈశ్వరన్ టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నప్పటికీ ఆడలేకపోవడం వరుసగా ఇది రెండవ సిరీస్. దేశీయ క్రికెట్‌లో అతని స్థిరమైన ప్రదర్శన ఆధారంగా, అతను భారత టెస్ట్ జట్టులో స్థానం పొందాడు. కానీ, అతను ఇంకా అరంగేట్రం చేయలేకపోయాడు. అభిమన్యు ఈశ్వరన్ 2021లో ఇంగ్లాండ్ పర్యటనకు మొదటిసారి ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అతను తన టెస్ట్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. నిరంతర నిర్లక్ష్యం తర్వాత, ఇప్పుడు అతని తండ్రి ఓపిక నశించింది. మూడు సంవత్సరాలు అయ్యిందని కానీ అతనికి ఆడే అవకాశం రాలేదని అతను చెప్పుకొచ్చాడు.

అభిమన్యు తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, ‘అభిమన్యు టెస్ట్‌లు ఆడటానికి నేను రోజులు లెక్కించడం లేదు. సంవత్సరాలు వేచి చూస్తున్నాను. మూడు సంవత్సరాలు అయింది. ఆటగాడి పని ఏమిటి? అతని పని పరుగులు సాధించడమే. ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా A తో జరిగిన రెండు మ్యాచ్‌లలో అతను ప్రదర్శన ఇవ్వలేదు. దీని కారణంగా అతనికి జట్టులో స్థానం లభించలేదని ప్రజలు అంటున్నారు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు అభిమన్యు ప్రదర్శన ఇచ్చినప్పుడు, కరుణ్ నాయర్ జట్టులో లేడు. కరుణ్ దులీప్ ట్రోఫీకి లేదా ఇరానీ ట్రోఫీకి ఎంపిక కాలేదు. గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు సమయాన్ని పరిశీలిస్తే, అభిమన్యు 864 పరుగులు చేశాడు.’

రంగనాథన్ మాట్లాడుతూ.. మరి మీరు ఎలా పోల్చుతారు? నాకు అర్థం కాలేదు. వారు కరుణ్ నాయర్‌కు అవకాశం ఇచ్చారు. నిజమే, అతను 800 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచారు. ఆడే అవకాశం రాకపోవడంతో అభిమన్యు నిరాశలో ఉన్నాడు’ అంటూ చెప్పకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో అభిమన్యు తండ్రి తన కొడుకుతో నిరంతరం టచ్‌లో ఉండి, అతన్ని ప్రోత్సహిస్తున్నాడని తెలిపాడు. ‘నా కొడుకు కొంచెం నిరాశకు గురయ్యాడు. కొంతమంది ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడటం ద్వారా టెస్ట్ జట్టులోకి ఎంపిక చేస్తారు. సుదీర్ఘ ఫార్మాట్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడు, ఐపీఎల్ ప్రదర్శనను లెక్కించకూడదు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ టెస్ట్ ఎంపికకు ఆధారం కావాలి’ అని అతను తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..