Viral Video: నువ్వు అడవికి రాజైతే నాకేంటి తొక్క..! సింహానికే సుస్సు పోయించిన అడవి దున్న..
Lion Vs Buffalo Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరలవుతుంటాయి. ఇందులో ప్రస్తుతం అడవి దున్న, సింహానికి సంబంధించిన వీడియో కూడా చేరింది. ఈ వీడియోలో అడవి దున్న సింహాన్ని చూసి కొద్ది దూరం పరిగెత్తి ఆ తర్వాత తన బలాన్ని చూపించేందుకు ఎదురు నిలిచింది. ఈ వీడియో చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు.

Lion Vs Buffalo Viral Video: సాధారణంగా అడవికి రాజు సింహం. దాని గంభీరమైన రూపాన్ని చూసి ఏ జంతువైనా భయంతో పారిపోతుంది. అలాంటి సింహం ఒక అడవి దున్నపోతును చూసి భయపడి వెనకడుగు వేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, అడవిలో ఏది ఎప్పుడు జరుగుతుందో ఊహించలేమని మరోసారి నిరూపించింది. ఈ వీడియో మే 21న @themarkpentecost అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అప్పటి నుంచి దీనికి 1.1 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. అలాగే, వ్యూస్ కోట్లలో ఉన్నాయి.
ఈ వీడియోలో, ఒక సింహం రెండు అడవి దున్నపోతులను వేటాడేందుకు ప్రయత్నిస్తుంది. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో దున్నపోతులు భయపడి పారిపోవడం లేదా లొంగిపోవడం జరుగుతుంది. కానీ ఈ దున్నపోతు మాత్రం భిన్నంగా స్పందించింది. సింహాన్ని చూసి కొద్దిసేపు బెదిరినట్లు నటించింది. ఆ తర్వాత ధైర్యంగా దానికి ఎదురు నిలబడింది. కోపంగా, భయంకరమైన చూపులతో సింహాన్ని బెదిరించింది.
అడవి దున్నపోతు ఊహించని విధంగా ఎదురు తిరగడంతో సింహం ఒక్కసారిగా సాక్ అయింది. దున్నపోతు దూకుడు స్వభావం, భయంకరమైన చూపులు సింహాన్ని వెనకడుగు వేసేలా చేశాయి. కొన్ని క్షణాల పాటు తటపటాయించిన సింహం, చివరకు వేరే మార్గం లేక వెనక్కి తగ్గింది. ఆ అడవి దున్నపోతు ధైర్యాన్ని చూసి సింహం భయపడి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.
View this post on Instagram
ఈ సంఘటన జంతు రాజ్యంలో అంచనాలు ఎప్పుడూ నిజం కావని, కొన్నిసార్లు బలహీనంగా భావించే జీవి కూడా అత్యంత శక్తివంతమైన జీవిని భయపెట్టగలదని నిరూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఈ అడవి దున్నపోతు ధైర్యాన్ని, సింహం వెనకడుగు వేయడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అడవిలో ప్రతి జంతువుకూ దానిదైన శక్తి ఉంటుందని, కొన్నిసార్లు పరిమాణం లేదా బలం కంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంత ముఖ్యమో ఈ వీడియో స్పష్టం చేస్తుంది. ఈ సంఘటన నిజంగా అద్భుతం, అడవిలో ప్రతిరోజూ కొత్త పాఠాలు నేర్పుతుందని మరోసారి రుజువు చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




