AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిమ్మ చీకట్లో చెట్టు కొమ్మపై ఏదో అలికిడి.. అసలు సీన్ చూసి బెంబేలెత్తిన జనాలు..

Viral Video Of Ichhadhari Nagini: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ సందడి చేస్తోంది. దీనికి సంబంధించి కోరికలు తీర్చే సర్పం చెట్టుపై కూర్చుని ఉందని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఈ సీన్ చూసిన చుట్టుపక్కల జనాలు షాక్ అయినట్లు వీడియో చూడొచ్చు.

Viral Video: చిమ్మ చీకట్లో చెట్టు కొమ్మపై ఏదో అలికిడి.. అసలు సీన్ చూసి బెంబేలెత్తిన జనాలు..
Ichhadhari Nagini
Venkata Chari
|

Updated on: Jul 31, 2025 | 4:31 PM

Share

Viral Video Of Ichhadhari Nagini: ఇచ్ఛాధారి నాగు లేదా దేవ నాగు, నాగు పాముల ప్రపంచంలో అత్యంత మర్మమైన, శక్తివంతమైన జీవులుగా పరిగణిస్తారు. ఇవి తమ గత జన్మలోని విషయాలను గుర్తుంచుకుంటాయని, తమ భాగస్వామికి ఏదైనా చెడు జరిగితే, ప్రతీకారం తీర్చుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెబుతుంటారు. హిందూ పురాణాల మేరకు వీటికి సంబంధించిన అనేక కథలను ఇప్పటికే చదివి, విని ఉంటారు. కానీ మీరు నిజంగా దేవ నాగును చూశారా? లేకపోతే, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక వీడియో సోసల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇందులో దేవనాగు ఒక చెట్టు పైన కూర్చుని ఉన్నట్లు చూడొచ్చు.

ఈ వీడియోలో కనిపించిన దేవనాగును చూసేందుకు ఎంతోమంది వ్యక్తులు గుమికూడారు. ఇందులో వారంతా తమ ఫోన్‌లతో వీడియోను రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఇది ఇంటర్నెట్ ప్రపంచంలోకి వచ్చిన వెంటనే తెగ వైరల్ అవుతోంది. క్లిప్‌లో, చెట్టు కొమ్మపై ఒక పాము ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ సీన్ ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సాధారణంగా పాములు నేలపై లేదా పొదల్లో కనిపిస్తాయి. కానీ ఈ పాము చెట్టుపై కూర్చుని ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అందుకే ఈ వీడియో అందరికీ షాకింగ్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి

మీరు ఈ క్లిప్‌ను జాగ్రత్తగా గమనిస్తే, ఈ నాగిని నుదిటిపై రత్నం లాంటిది ప్రకాశిస్తుందని మీకు అర్థమవుతుంది. వీడియోలో జనాల గొంతులు కూడా వినిపిస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన వ్యక్తులు ఎంతో ఆశ్చర్యపోతున్నట్లు చూడొచ్చు. కొంతమంది వినియోగదారులు దీనిని ఒక అద్భుతం అని భావిస్తున్నారు.

ఈ వీడియోను @Gurukulam2024 అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. దీన్ని చూసిన తర్వాత వేలాది మంది యూజర్లు తమ కామెంట్స్ తెలియజేస్తున్నారు. ఒక యూజర్ దీనిని చూసిన తర్వాత, ఇది సాధారణ సర్పం కాదని స్పష్టంగా అర్థమవుతుందని రాశారు. అదే సమయంలో, మరొకరు పాములు ఇంత ఎత్తులో కూర్చోవని, ఇది ఖచ్చితంగా దేవనాగు అని రాశారు. మరొకరు ఈ దృశ్యం నిజమైనది కాదని, ఎడిటింగ్ ఫలితమని రాశారు. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న నిజం ఏమిటో తెలియదు. మరికొంతమంది ఇది ఏఐ వీడియో అని వాదిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..