AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పడగవిప్పిన నల్లతాచు ముందు అద్దం పెట్టిన వ్యక్తి.. ఆ తర్వాత..

పాములు చాలా ప్రమాదకరమైనవి. తమకు హాని అని తెలిస్తే చాలు.. అవి వెంటనే అటాక్ చేస్తాయి. ఈ మధ్య ఒక వ్యక్తి పాము పట్టి.. దాన్ని మెడలో వేసుకు తిరిగి కాటుకు బలయ్యాడు. అయినా కొందరికీ తెలివి రావడం లేదు. తాజాగా ఒక వ్యక్తి.. పడగ విప్పిన పాము ముందు అద్దం పెట్టి పైత్యం ప్రదర్శించాడు.

Viral Video: పడగవిప్పిన నల్లతాచు ముందు అద్దం పెట్టిన వ్యక్తి.. ఆ తర్వాత..
Cobra
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2025 | 3:18 PM

Share

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. మాములు కంటెంట్ కాదు.. తెలియకుండానే గంటల గంటల సమయం అయిపోతుంది. ఇన్‌ప్లూయన్సర్స్ కంటెంట్‌తో పాటు.. వివిధ రకాల యానిమల్ వీడియోలు సైతం ట్రెండ్ అవుతూ ఉంటాయి. అయితే పాముల వీడియోలకు ఎప్పుడూ రీచ్ ఎక్కువ ఉంటుంది. పాములు అంటే భయం ఉన్నప్పటికీ.. వాటికి సంబంధించిన కంటెంట్ మాత్రం బాగా చూస్తారు. వాటిని ఇలా పోస్ట్ చేయగానే.. అలా మిలియన్ల కొద్దీ వ్యూస్, వేల కొద్ది లైక్స్, కామెంట్స్ వస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

తాచుపాము అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటి అని అందరికీ తెలుసు. తమ హాని కలుగుతుందని భావిస్తే అవి కాటు వేయడానికి అరక్షణం కూడా ఆలోచించవు. అయితే కొందరు వ్యక్తులు.. మంచి రీచ్ సంపాదించడానికి రీల్స్ తయారు చేస్తారు. కాటుకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిసినా లైక్‌లు, వ్యూస్ కోసం ఈ తరహా వీడియోలు చేస్తారు. అలాంటి ఒక రీల్ గురించి ప్రస్తుతం కొత్త మీడియాలో చర్చ జరుగుతోంది.

పడగవిప్పిన పాము ముందు.. అద్దం పెడితే అది ఎలా ప్రతిస్పందిస్తుంది అన్నది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. అయితే ఈ నల్లతాచు ముందు అద్దం పెట్టగా.. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి, అది మరొక పాముగా భావించింది. కాసేపు అద్దంవైపే తదేకంగా చూసింది. తరువాత అది పడగవిప్పి, కోపంగా అద్దంలో తన ప్రతిబింబాన్ని కాటేసింది. ఈ వీడియోలో నాగిన్ చిత్రంలోని ‘తేరే ఇష్క్ కా ముజ్ పర్ హువా యే అసర్ హై’ పాట నేపథ్యంలో ప్లే అవుతుంది.

ఈ వీడియోను @salman_pathan230 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిని 106 మిలియన్లకు పైగా వీక్షించారు. వేలాది మంది వ్యాఖ్యానించారు, వారిలో ఎక్కువ మంది వీడియోలోని వ్యక్తిని తీవ్రంగా విమర్శించారు. పాముతో ఇలా ప్రవర్తించకూడదని.. ఇది చాలా ప్రమాదకరమని కామెంట్ చేశారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..