ENG vs ITA : 6, 6, 6, 6, 6, 6… 6 సిక్సర్లు, 4 ఫోర్లు..వరల్డ్ కప్ డెబ్యూలోనే ఇటలీ స్టార్ ప్లేయర్ విధ్వంసం
ENG vs ITA : టీ20 ప్రపంచకప్ 2026లో ఊహించని సంచలనం నమోదైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం (ఫిబ్రవరి 16) ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో ఇటలీ బ్యాటర్ బెన్ మానేంటి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇటలీ ఒకానొక దశలో తడబడినప్పటికీ, మానేంటి తన వీరబాదుడుతో ఇంగ్లాండ్ బౌలర్లను వణికించాడు.

ENG vs ITA : టీ20 ప్రపంచకప్ 2026లో ఊహించని సంచలనం నమోదైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం (ఫిబ్రవరి 16) ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్-సి మ్యాచ్‌లో ఇటలీ బ్యాటర్ బెన్ మానేంటి విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇటలీ ఒకానొక దశలో తడబడినప్పటికీ, మానేంటి తన వీరబాదుడుతో ఇంగ్లాండ్ బౌలర్లను వణికించాడు. కేవలం 25 బంతుల్లోనే 60 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌ను దాదాపు ఓటమి అంచులకు తీసుకెళ్లాడు. ఇటలీ ఇన్నింగ్స్ ఆరంభంలోనే జోఫ్రా ఆర్చర్ ధాటికి ఆంథోనీ మోస్కో, జేజే స్మట్స్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన బెన్ మానేంటి ఏమాత్రం తడబడకుండా ఇంగ్లాండ్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 6 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను బాదిన సిక్సర్లు చూసి ఈడెన్ గార్డెన్స్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. జస్టిన్ మోస్కోతో కలిసి 92 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ బౌలర్ల నుంచి కరుణ కోసం వేడుకునే పరిస్థితిని కల్పించాడు.
మానేంటి జోరు చూస్తుంటే ఇటలీ గెలవడం ఖాయమనిపించింది. అయితే విల్ జాక్స్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయిన మానేంటి.. టామ్ బాంటన్ చేతికి చిక్కాడు. లాంగ్-ఆన్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి బాంటన్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మానేంటి ఇన్నింగ్స్ ముగిసింది. అతను అవుట్ అయిన తర్వాత ఇటలీ పట్టు కోల్పోయింది. అయినప్పటికీ డెబ్యూ సీజన్‌లోనే ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు ఇటలీ ఈ స్థాయిలో పోటీ ఇవ్వడం పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడుతున్న ఇటలీ జట్టు ఈ టోర్నీలో డార్క్ హార్స్‌లా కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మోస్కో బ్రదర్స్ నిలకడైన ఆటతీరు, బెన్ మానేంటి వంటి హిట్టర్లతో ఈ జట్టు గ్రూప్-సి లో బలమైన పోటీదారుగా నిలిచింది. ఇంగ్లాండ్‌పై మానేంటి ఆడిన ఇన్నింగ్స్ ఇటలీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.
Ben Manenti is taking the fight to the spinners! 🔥
He is building a vital partnership with Justin Mosca to keep Italy right in the hunt. 🇮🇹
ICC Men’s #T20WorldCup | #ENGvITA | LIVE NOW ➡️ https://t.co/xRf3Nc9OQ0 pic.twitter.com/ShqJj9baNs
— Star Sports (@StarSportsIndia) February 16, 2026
ఒకప్పుడు కేవలం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి జట్లకే పరిమితమైన క్రికెట్.. ఇప్పుడు ఇటలీ వంటి దేశాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ మానేంటి అటాకింగ్ గేమ్ చూస్తుంటే పసికూనలు కూడా పులుల్లా గర్జిస్తున్నాయని అర్థమవుతోంది. ఈ మ్యాచ్ ఫలితం ఏదైనా ఇటలీ ప్రదర్శన మాత్రం ప్రపంచ క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
