
IPL Most Ducks: IPL 2024 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మార్చి 22న లీగ్ ప్రారంభం కానుంది. లీగ్‌లోని గత 16 సీజన్‌లలో చాలా పెద్ద రికార్డులు సృష్టించబడ్డాయి. ఆటగాళ్ల పేర్లలో అత్యంత చెత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇందులో కీలకంగా వినిపించే పేరు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మదే కావడం గమనార్హం. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట చెత్త రికార్డులు నమోదు చేసుకునే ప్రమాదంలో పడ్డాడు. ఈ సీజన్‌లో తీరు మార్చుకోకపోతే 17వ నంబర్‌కు బలయ్యే ఛాన్స్ ఉంది. అదేంటి, అసలు రోహిత్‌కు వచ్చిన ప్రమాదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సున్నాలో ఔట్ అయిన టాప్ 5 ఆటగాళ్ల గురించి మాట్లాడితే, ఈ జాబితాలో ముగ్గురు భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉన్నారు. IPL 2024లో కొన్ని మ్యాచ్‌లలో అతని బ్యాట్ పని చేయకపోతే, అతను కూడా అగ్రస్థానానికి చేరుకోవచ్చు. లేదా 17 నంబర్‌ను కూడా సమం చేసే అవకాశం ఉంది.
1. దినేష్ కార్తీక్: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు సున్నాకి ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్. 2008 నుంచి 2023 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ఆడిన కార్తీక్ 242 మ్యాచ్‌ల్లో 221 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో 17 సార్లు ఖాతా తెరవలేకపోయాడు. అతను లీగ్‌లో 20 అర్ధసెంచరీలతో సహా 4516 పరుగులు చేశాడు.
2. రోహిత్ శర్మ: ఈ జాబితాలో దినేష్ కార్తీక్ తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. 2008 నుంచి 2023 మధ్య డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడిన రోహిత్ 243 మ్యాచ్‌లలో 238 ఇన్నింగ్స్‌లలో 16 సార్లు డకౌట్ అయ్యాడు. అంటే, ఈ సీజన్‌లో హిట్‌మ్యాన్ అగ్రస్థానానికి చేరుకునే ప్రమాదం ఉంది. ఒక సెంచరీ, 42 హాఫ్ సెంచరీలతో సహా రోహిత్ పేరిట 6211 పరుగులు ఉన్నాయి.
3. సునీల్ నరైన్: వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ 2012 నుంచి 2023 మధ్య కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున 162 మ్యాచ్‌లలో 96 ఇన్నింగ్స్‌లలో 15 సార్లు సున్నాకి ఔటయ్యాడు. ఈ సమయంలో అతను నాలుగు అర్ధసెంచరీలతో సహా 1046 పరుగులు చేశాడు.
4. మన్‌దీప్ సింగ్: 2010 నుంచి 2023 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున 111 మ్యాచ్‌లలో 98 ఇన్నింగ్స్‌లు ఆడిన మన్‌దీప్.. ఈ కాలంలో 15 సార్లు సున్నాకి ఔటయ్యాడు. అతని పేరిట 6 అర్ధ సెంచరీలు సహా 1706 పరుగులు ఉన్నాయి.
5. రషీద్ ఖాన్: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ 2017 నుంచి 2023 మధ్య సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌లో భాగంగా ఉన్నాడు. ఈ కాలంలో, అతను 109 మ్యాచ్‌లలో 52 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అందులో రషీద్ ఖాన్ 14 సార్లు సున్నాకి ఔట్ అయ్యాడు. అతని పేరిట ఒక యాభై సహా 443 పరుగులు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..