Video: విజయానికి 2 పరుగులు.. కట్‌చేస్తే.. మైండ్ బ్లోయింగ్ సీన్ భయ్యో.. క్రికెట్ ఫ్యాన్స్ మస్ట్‌గా చూడాల్సిన వీడియో
Funny Video: ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది చాలా నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటనను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “అంత కష్టపడి బౌలింగ్ చేయడం ఎందుకు? ఇలాంటి ఫీల్డర్స్ ఉన్నప్పుడు” అని కొందరు, “ఇదేమి క్రికెట్టో” అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.

Funny Video: క్రికెట్ ఆట ఎప్పుడూ ఊహించని మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, స్థానిక టోర్నమెంట్లలో ఆడేటప్పుడు, ప్రొఫెషనల్ గేమ్‌లలో కూడా చూడని కొన్ని అద్భుతమైన, హాస్యభరితమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల భారతదేశంలోని ఓ స్థానిక మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారి, అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది.
స్టోరీలోకి వెళ్తే..
ఒక స్థానిక టోర్నమెంట్‌లో మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడ చివరి బంతికి బ్యాటింగ్ జట్టుకు రెండు పరుగులు తీయాల్సి ఉంది. అంటే గెలవడానికి రెండు పరుగులు కావాలి. ఉన్నది ఒక్క బాల్. దీంతో అంతా ఫలితం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బౌలర్ చివరి బంతిని సంధించాడు. క్రీజులో బ్యాటర్ కూడా కట్ షాట్ ఆడి పరుగు లంఖించాడు. అయితే, బంతి క్రీజు దగ్గర్లోని ఫీల్డర్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ రన్ తీసిన బ్యాటర్లు.. మరో రన్ కోసం సిద్ధమయ్యారు. బంతి దొరికిన ఫీల్డర్ ఆ వెంటనే బౌలర్‌తోపాటు మరో పీల్డర్ వికెట్ల వద్ద వేచి చూస్తున్న వారికి విసిరాడు. కానీ, వారిద్దరు బంతిని పట్టుకోకుండా, నేరుగా వికెట్లకు తాకుతుందని భావించి వదిలేశారు. దీంతో రెండో రన్ కూడా పూర్తి చేసిన బ్యాటర్లు విజయానందంలో చిందులు వేయగా, ఫీల్డింగ్ టీం ఒకరి నొకరు తిట్టుకుంటూ దిగాలుగా కనిపించారు.
2 runs needed in 1 ball, and then the bowler and one of the fielders did this 😂
– A Rare Video, You Must Watch it 😅 pic.twitter.com/wDrDIhWidr
— Richard Kettleborough (@RichKettle07) August 18, 2025
దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇది చాలా నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటనను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “అంత కష్టపడి బౌలింగ్ చేయడం ఎందుకు? ఇలాంటి ఫీల్డర్స్ ఉన్నప్పుడు” అని కొందరు, “ఇదేమి క్రికెట్టో” అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సంఘటన బౌలర్‌కు, ఫీల్డర్‌కు ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








