Complaint Filed Against Dhawan: పక్షులకు ఆహారం వేసి అడ్డంగా బుక్ అయిన శిఖర్ ధావన్.. వారణాసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు
భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ వారణాసి పర్యటన సమయంలో పక్షులకు ఆహారం వేసి.. వివాదాల్లోకి చిక్కుకున్నాడు.. తాజాగా అతనిపై వారణాసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో..
Complaint Filed Against Dhawan: భారత్ క్రికెటర్ శిఖర్ ధావన్ వారణాసి పర్యటన సమయంలో పక్షులకు ఆహారం వేసి.. వివాదాల్లోకి చిక్కుకున్నాడు.. తాజాగా అతనిపై వారణాసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలైంది. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో ధావన్ పక్షులకు ఆహారం వేయడం తప్పని.. సిద్దార్థ్ శ్రీవాత్సవ అనే లాయర్ అతనిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో గురువారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ త్రితియా దివాకర్ కుమార్ ధావన్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన నెక్స్ట్ విచారణ వచ్చే నెల 6వ తేదీన జరపనున్నామని కోర్టు తెలిపింది.
వారణాసి పర్యటన సమయంలో శిఖర్ ధావన్ ఓ బోటులో షికారు చేస్తూ… పక్షులకు ఆహారం వేశాడు.. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పక్షులకు మేత తినిపించడం ఎంతో సంతోషంగా ఉందని కామెంట్ కూడా జతచేశాడు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో వారణాసి కలెక్టర్ స్పందించారు. ధావన్ విహరించిన బోటు యజమానిపై చర్యలకు ఆదేశించారు. దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న తరుణంలో పక్షులకు మేత వేయడం నిశిద్ధమని పర్యాటకులకు అవగాహన లేక పోయినా బోటు యజమానులు విషయం తెలియజేయాలన్నారు. బోటు యజమాని నిబంధనలు ఉల్లంఘించారంటూ మేజిస్ట్రేట్ వ్యాఖ్యానించారు.
Also Read: బ్రహ్మ తన తలరాతను తానే మార్చుకున్న దివ్య క్షేత్రం.. ఇక్కడ శివుడిని పూజించిన భక్తుల కష్టాలు మాయం